దేశీయ స్టాక్ మార్కెట్లు మూడో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసేసరికి దేశీయ సెన్సెక్స్ 32 , 424 పాయింట్ల మార్కు చేరి మూడో రోజు ర్యాలీ కొనసాగించింది. వరుసగా మూడు రోజుల పాటు స్టాక్ మార్కెట్లు జోరు చూపించటం ఒక శుభ పరిణామం . బెంచ్ మార్క్ సూచీలు వరుసగా మూడవ రోజు కూడా పైనే ముగిశాయి , నిఫ్టీ జూన్ సిరీస్ మొదటి రోజు 9,550 స్థాయికి మించిపోయింది. సెన్సెక్స్ 223.51 పాయింట్లు లేదా 0.69% శాతం లాభపడింది . 32,424.10 వద్ద సెన్సెక్స్ నిలిచింది. నిఫ్టీ 90.20 పాయింట్లు పెరిగి 0.95% పెరిగి 9,580.30 వద్ద ఉంది. సుమారు 1,390 షేర్లు లాభాల్లో పయనించగా , 924 షేర్లు క్షీణించాయి . మరియు 159 షేర్లు తటస్థంగా ఉన్నాయి.

రోజంతా ఒడిదుడుకుల వూగిసలాట .. అయినా లాభాల్లోనే
మొన్న 1,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ నిన్న మరో 595 పాయింట్లు బలపడింది. ఇక నేడు 224 పాయింట్లు పెరిగింది . రోజంతా మార్కెట్లు పలుమార్లు స్వల్పస్థాయిలో ఆటుపోట్లను చవిచూశాయి. సెన్సెక్స్ 32,480 వద్ద గరిష్టాన్ని తాకగా 31,824 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 9599- 9377 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. లాక్ డౌన్ ఎత్తివేతపై అంచనాలు, అమెరికా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు ట్రేడర్లకు హుషారునిచ్చినట్లు ఆర్ధిక నిపుణులు,మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వోడాఫోన్, ఐడియా కంపెనీలో గూగుల్ పెట్టుబడి వారత్తో ఉదయం బాగా పెరిగిన షేర్ ..
వోడాఫోన్, ఐడియా కంపెనీలో గూగుల్ దృష్టి పెడుతుందన్న మీడియా నివేదికపై కంపెనీ స్పష్టత ఇచ్చిన తరువాత షేర్ ధర రోజు గరిష్ట స్థాయి నుండి 20 శాతం తగ్గింది. గూగుల్ వాటాను కొనుగోలు చేసే ప్రతిపాదన లేదని బోర్డు తెలిపింది. వోడాఫోన్ ఐడియాలో 5 శాతం వాటా కొనుగోలుతో టెక్ దిగ్గజం గూగుల్ భారత టెలికాం మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తున్నట్లు వార్తలు రావడంతో మే 29 న ఉదయం ట్రేడింగ్‌లో షేర్ ధర 34 శాతం పెరిగింది. ఇక కంపెనీ ప్రకటనతో ఒక్కసారిగా తగ్గింది . ఇక విప్రో విషయానికి వస్తే జూలై 6, 2020 నుండి కంపెనీ థియరీ డెలాపోర్ట్‌ను సిఇఒ & మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించిన తరువాత ఐటి మేజర్ విప్రో షేర్ ధర 6 శాతం పెరిగింది.

లాభ పడిన నష్టపోయిన షేర్లు ఇవే
ఇక ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, మెటల్, ఆటో, బ్యాంకింగ్ , ఎఫ్‌ఎంసీజీ 4.3-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. ఇక నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, విప్రో, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, యూపీఎల్, ఐటీసీ 7.5-3.5 శాతం మధ్య ఊగిసలాడాయి . అయితే ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, టైటన్,కొటక్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్, 2.3-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. రియల్టీ స్టాక్స్‌లో బీఎస్‌ఈలో ఫీనిక్స్, ప్రెస్టేజ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్‌ఎఫ్, ఒబెరాయ్ 8.5-3.5 శాతం మధ్య పైకి ఎగిశాయి.
More From GoodReturns

HDFC Bank ఫలితాలు: సోమవారం మార్కెట్ భారీగా పడిపోతుందా?

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. ట్రంప్ ప్రకటనతో షేర్ మార్కెట్లో పుల్ జోష్..

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

బంగారం, భూమి, స్టాక్ మార్కెట్.. ఈ ఏడాది తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ఆప్షన్ ఏదంటే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

Paskistan: పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..



Click it and Unblock the Notifications