Tax exemption Limit Up: దేశంలోని వేతనజీవులతో పాటు అనేక మంది నిపుణుల మాట పరిగణలోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో దేశ ప్రజలందరికీ ఊరటను కలిగించే పెద్ద ప్రకటన చేశారు.
న్యూ టాక్స్ రీజిమ్ కింద పన్ను రహిత ఆదాయ పరిమితిని రూ.12 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గత బడ్జెట్ ప్రసంగం సమయంలో ఆర్థిక మంత్రి దీనిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. అలాగే అప్పట్లో ఆర్థిక మంత్రి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. నిర్మలమ్మ వరాల జల్లుతో న్యూటాక్స్ రీజిమ్ కింద పన్ను చెల్లిస్తున్న ప్రజలకు గరిష్ఠంగా రూ.12.75 లక్షల వరకు ఉన్న ఆదాయంపై సున్న పన్ను ఉంటుందని వెల్లడించింది.

న్యూ టాక్స్ రీజిమ్ కింద ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త పన్ను శ్లాబ్ రేట్లు.. ముందుగా రూ.4 లక్షల వరకు ఉన్న ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీని తర్వాత రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు 5 శాతం పన్ను రేటు, రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉన్న ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం ఆదాయపు పన్ను, రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయంపై 20 శాతం పన్ను, రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను రేటును నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక చివరిగా రూ.24 లక్షలకు పైన ఉండే ఆదాయంపై పన్ను చెల్లింపుదారులు 30 శాతం పన్ను చెల్లించాలని నిర్మలమ్మ ప్రకటించారు.
ఇదే క్రమంలో పాత పన్ను విధానంలో మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. ఈ క్రమంలో పన్ను శ్లాబ్ రేట్లను పరిశీలిస్తే.. రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను రేటు చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయంపై 20 శాతం పన్ను, రూ.15 లక్షలకు మించి ఆదాయం ఉన్న వ్యక్తులు 30 శాతం పన్ను రేటు చెల్లించాల్సి ఉంటుంది.
పాత పన్నుల విధానానికి సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో 80C లేదా 80D సెక్షన్ల కింద తగ్గింపుల పరిమితి పెంచుతారని భావించిన చాలా మంది టాక్స్ పేయర్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిగా నిరాశను మిగిల్చారు. కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఆర్థిక మంత్రి సడలింపు ఇచ్చారు. గత బడ్జెట్‌లోనూ స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పాత పన్ను విధానాన్ని రద్దు చేయనుందా అనే ప్రశ్న మళ్లీ తెరమీదకు రావటంతో దీనిపై పెద్ద చర్చ కొనసాగుతోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications