For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వైరస్ 'ఆర్థిక' పరిష్కారాలపై నిర్మల సీతారామన్

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరోనా మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని పరిష్కరించే చర్యలను సోమవారం సభకు తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. నాన్ రెసిడెంట్స్ ఆదాయంపై పన్ను పరిమితిని రూ.15 లక్షలకు ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

పెట్రోల్, డీజిల్‌పై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని వరుసగా రూ.18, రూ.12గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 14న ఎక్సైజ్ డ్యూటీని అదనంగా రూ.2 పెంచారు. కరోనా సహా వివిధ కారణాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి.

FM may unveil steps to tackle Coronavirus today

అయితే అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఆ ధరలు ఎంతకాలం తక్కువగా ఉంటాయో చెప్పలేం. ఆ తర్వాత భారీగా పెరిగినా చెప్పలేం. కేంద్రం మాత్రం దీనిపై వేచిచూసే ధోరణితో పాటు మందగమనం కారణంగా పడిపోయిన రెవెన్యూను పెంచుకోవాలని భావిస్తోంది.

పెట్రోల్, డీజిల్‌పై రూ.1 పెంచితే ప్రభుత్వానికి రూ.13,000 కోట్లు అదనంగా వస్తుందని అంచనా. పెట్రో ఉత్పత్తులపై, బంగారంపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ఆయా రంగాలు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాయి.

English summary

కరోనా వైరస్ 'ఆర్థిక' పరిష్కారాలపై నిర్మల సీతారామన్ | FM may unveil steps to tackle Coronavirus today

Finance minister Nirmala Sitharaman could announce measures to deal with the economic impact of Covid-19 in her reply to the Finance Bill on Monday.
Story first published: Monday, March 23, 2020, 12:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X