బంగారం అంటే భారతీయులకు ఎనలేని మక్కువ. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి భారతీయ మహిళలు చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు. బంగారంతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది అంటే అతిశయోక్తి కాదు. అటువంటి బంగారం ఇటీవల కాలంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందనంతగా ధరలు పెరుగుతోంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఈ సంవత్సరం ఆరంభం నుండి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. త్వరలో బంగారం 70 వేల రూపాయలకు చేరుకుంటుందని ఒక అంచనా. ఇక దేశీయంగా బంగారం ధరలు చూస్తే తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద వంద రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద నూట పది రూపాయల మేర ధర పెరిగింది.
హైదరాబాద్ లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,850 గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 930 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,000 రూపాయలు కాగా, 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,080 రూపాయలు గా ట్రేడ్ అవుతుంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,850 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60,930 రూపాయలుగా ట్రేడవుతోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, రాజమండ్రి, కాకినాడలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,850 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60, 930 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
దేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలో చెన్నై, మధురై, కోయంబత్తూర్, తిరునవ్వేలి, తిరుచ్చి, తిరుపూర్, సేలం , ఈరోడ్ లలో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,200 రూపాయలు కాగా 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,310రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications