త్వరలో హోల్‌సేల్ మార్కెట్లోకి ఫ్లిప్‌కార్ట్, వ్యాపారులకు మంచి అవకాశం..
వాల్‌మార్ట్‌కు చెందిన ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ నుండి తన హోల్‌సేల్ వ్యాపారాన్ని ప్రారంభించనుందట. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2020-21 తొలి క్వార్టర్‌లో ప్రారంభించవచ్చు. అమెజాన్ B2B డివిజన్‌తో పాటు రిలయన్స్ మార్కెట్, టెన్సెంట్‌కు చెందిన ఉడాన్ లాంటి ఈ-కామర్స్ స్టార్టప్స్‌తో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు గత కొన్ని నెలల నుంచి తన సప్లయ్ చైన్‌ను పెంపొందించుకోవడంకోసం పాటు ఉత్పత్తిదారులతో చర్చలు జరుపుతోంది.

FMCG ప్రాజెక్టు..
ఢిల్లీ-NCRలోని కిరాణా దుకాణాలకు సరుకుల్ని సరఫరా చేసేందుకు ప్రయోగాత్మకంగా FMCG ప్రాజెక్టును నడుపుతోందని చెబుతున్నారు. కిరాణా దుకాణాలకు సరఫరా చేసే సరుకుల సేకరణని పెంపొందించేందుకు అవసరమయ్యే పెట్టుబడుల విషయమై B2B FMCG సప్లయ్ చైన్ స్టార్టప్ జంబోటెయిల్‌తో కూడా ఫ్లిప్‌కార్ట్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆహారపదార్ధాలపైదృష్టి
ఫ్లిప్‌కార్ట్ తొలుత FMCGపాటు తాజా ఆహారపదార్థాలపై దృష్టి సారించి హోల్‌సేల్ వ్యాపారాన్ని ప్రారంభిస్తుందని, ఆ తర్వాత మరిన్ని కేటగిరీలకు విస్తరిస్తుందని చెబుతున్నారు. ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆధర్శ్ మీనన్ నేతృత్వంలో ముందుకు సాగుతోంది. అయిదు నెలల్లో తమ కన్స్యూమర్ మార్కెట్ డివిజన్‌కు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్స్‌ను హోల్‌సేల్ బిజినెస్ డివిజన్‌కు బదలీ చేసినట్లు చెప్పారు.

వ్యాపారులకు మంచి అవకాశం..
కిరాణా దుకాణదారులకు, చిన్న, మధ్య తరహా వ్యాపారులకు B2B సెగ్మెంట్ మంచి అవకాశంగా భావిస్తున్నామని, కిరాణా వ్యవస్థను సమర్థవంతంగా తీర్చిదిద్దడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుందని ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధులు చెబుతున్నారు.

పెట్టుబడులు
రైతుల నుండి నేరుగా జరిపే కొనుగోళ్లను పెంచేందుకు డిసెంబర్‌లో నీంజాకార్డ్‌లో ఫ్లిప్‌కార్ట్ ఇన్వెస్ట్ చేసింది. నీంజాకార్డ్ పండ్లు, కూరగాయలు సరఫరా చేసే సంస్థ. ఫుడ్ రిటైల్‌లో అడుగు పెట్టేందుకు ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్ మార్ట్ సంస్థను రిజిస్టర్ చేసింది. B2B లాస్ట్ మైల్ డెలివరీ ప్లాట్‌ఫాం షాడోఫాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications