ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు: 1 నుంచి బిగ్ షాపింగ్ డేస్, రూ.4వేల వరకు తగ్గింపు

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి ఆఫర్లు ప్రకటించింది. బిగ్ షాపింగ్ డేస్ పేరుతో భారీ సేల్‌తో డిసెంబర్ 1వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు వివిధ వస్తువులపై రాయితీలు అందిస్తోంది. ఈ ఏడాది చివరలో తాము ఇస్తున్న ఫెస్టివెల్ సేల్ అని పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించింది.

HDFC కార్డుపై 10 శాతం రాయితీ

HDFC కార్డుపై 10 శాతం రాయితీ

టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 75 శాతం వరకు, ల్యాప్‌టాప్, కెమెరాలపై 80 శాతం వరకు రాయితీ కల్పిస్తోంది. గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం డిస్కౌంట్ ఉంది. డీఎల్ఆర్ఎస్, డిజిటల్ కెమెరాలపై రూ.10,000 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్. హెడ్ ఫోన్లు, స్పీకర్స్ పైన 70 శాతం డిస్కౌంట్లు. HDFC కార్డు వినియోగదారులకు 10% ఇన్‌స్టాంట్ రాయితీ కల్పిస్తోంది. HDFC బ్యాంకు కార్డుపై డిస్కౌంట్లు, ఈఎంఐ సౌకర్యం ఉంది.

డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి..

డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి..

బిగ్ షాపింగ్ డేస్ సేల్ డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ వినియోగదారులకు ఈ ఆఫర్ నవంబర్ 30వ తేదీ రాత్రి 8 గంటలకు అందుబాటులోకి వస్తుంది. అందరికీ డిసెంబర్ 1 ఆదివారం (శనివారం రాత్రి 12 గంటల నుంచి) అందుబాటులోకి వస్తుంది ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు మాత్రం నాలుగు గంటల ముందే శనివారం ఎనిమిది గంటలకు అందుబాటులోకి వస్తుంది.

రూ.4వేల వరకు తగ్గింపు

రూ.4వేల వరకు తగ్గింపు

ఈ ఆఫర్‌లో భాగంగా రియల్ మి 5, రియల్ మి ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్, గూగుల్ పిక్సల్ 3ఏ, ఐఫోన్ 7, ఆసుస్ 5జెడ్, ఆపిల్ ఐఫోన్ 7 వంటి ఫోన్లపై రూ.వెయ్యి నుంచి రూ.4వేల వరకు తగ్గింపు ఉంది.

ఆయా మొబైల్‌పై ధరలు ఇలా...

ఆయా మొబైల్‌పై ధరలు ఇలా...

Realme 5 ధర రూ.9,999 కాగా డిస్కౌంట్‌పై రూ.8,999

Realme X ధర రూ.16,999 కాగా డిస్కౌంట్‌పై రూ.15,999

Samsung Galaxy S9 ధర రూ. 29,999 కాగా డిస్కౌంట్‌పై రూ.27,999

Samsung Galaxy S9+ ధర రూ.37,999 కాగా డిస్కౌంట్‌పై రూ.34,999

Google Pixel 3a ధర రూ.34,999 కాగా డిస్కౌంట్‌పై రూ.29,999

Apple iPhone 7 ధర రూ.27,999 కాగా డిస్కౌంట్‌పై రూ.24,999

Asus 5Z ధర రూ.16,999 కాగా డిస్కౌంట్‌పై రూ.15,999

బ్లాక్‌బస్టర్ డీల్స్, రష్ హవర్ డీల్

బ్లాక్‌బస్టర్ డీల్స్, రష్ హవర్ డీల్

అర్ధరాత్రి 12 గంటలు, ఉదయం 8 గంటలు, సాయంత్రం 4 గంటల సమయాల్లో Blockbuster Deals ప్రకటించింది. తెల్లవారుజామున రెండు గంటలకు Rush Hours ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+