For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత రేటింగ్ నెగిటివ్ నుండి స్థిరత్వం, వృద్ధి రేటు అంచనాలు సవరణ

|

భారత సార్వభౌమ రేటింగ్‌ను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ నెగిటివ్ నుండి స్థిరత్వానికి సవరించింది. రెండేళ్ల క్రితం స్థిరంగా ఉన్న రేటింగ్‌ను ఫిచ్ నెగిటివ్‌కు మార్చింది. కరోనా నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఇలాగే ఉంది. ప్రస్తుతం ఆర్థిక రికవరీ కనిపిస్తున్న పరిస్థితుల్లో రేటింగ్ సంస్థలు భారత వృద్ధి రేటును సవరిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఫిచ్ సవరించింది.

దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వల్ల మధ్యకాలిక వృద్ధి అంచనాలు కనిపించడంతో భారత రేటింగ్ విషయంలో తన దృక్పథాన్ని మార్చుకున్నట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. సమీప కాలంలో ప్రపంచ కమోడిటీ ధరల నుండి సవాళ్లు ఉన్నప్పటికీ, ఆర్థిక రంగంపై ఉన్న ఒత్తిడిని తగ్గించడం వల్ల వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపింది.

Fitch raises India outlook to stable, maintains rating

కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని తెలిపింది. రేటింగ్‌ను BBB- వద్ద కొనసాగించింది. అయితే 202-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాల్లో కోత విధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.5 శాతంగా ఉండవచ్చునని మార్చిలో అంచనా వేయగా, ఇప్పుడు దానిని 7.8 శాతానికి సవరించింది. 2024-27 మధ్య వృద్ధి రేటును 7 శాతంగా నమోదు కావొచ్చునని తెలిపింది.

English summary

భారత రేటింగ్ నెగిటివ్ నుండి స్థిరత్వం, వృద్ధి రేటు అంచనాలు సవరణ | Fitch raises India outlook to stable, maintains rating

Fitch Ratings raised its outlook for India's long-term foreign currency IDR to stable from negative on Friday, citing diminished downside risks to medium-term growth.
Story first published: Friday, June 10, 2022, 19:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X