For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వైరస్ ఎఫెక్ట్, భారత వృద్ధి రేటును భారీగా తగ్గించిన రేటింగ్ సంస్థలు

|

భారత జీడీపీ వృద్ది రేటు 4.9 శాతంగా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. కరోనా వైరస్ కారణంగా బలహీన డొమెస్టిక్ డిమాండ్, సరఫరాలో అంతరాయం నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాను సవరించింది. అంతకు ముందు 5.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసినప్పటికీ కరోనా భయాల నేపథ్యంలో కోత విధించింది.

వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) అంచనాలకు కూడా ఫిచ్ రేటింగ్స్ కోత పెట్టింది. దీనిని 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించింది. యూబీఎస్ కూడా 5.7 శాతం నుంచి 5.6 శాతానికి సవరించింది. వినియోగ డిమాండ్ బలహీనంగా ఉండటంతో తయారీ రంగంపై ఒత్తిడి పెరగనుందని, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కంపెనీలకు సరఫరా అడ్డంకులు ఎదురుకావొచ్చని పేర్కొంది.

ఇండియా డైమండ్ పరిశ్రమపై కరోనా వైరస్ భారీ దెబ్బఇండియా డైమండ్ పరిశ్రమపై కరోనా వైరస్ భారీ దెబ్బ

Fitch cuts India growth forecast to 4.9 percent

కాగా, కరోనా ప్రభావంతో జనవరి-మార్చి త్రైమాసిక వృద్ధికి 0.2 శాతం మేర గండిపడవచ్చని యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) భారత జీడీపీ వృద్ధి అంచనాను 5.1 శాతానికి సవరించినట్లు ఓఈసీడీ ప్రకటించింది. గతంలో 6.2 శాతంగా అంచనా వేసింది.

English summary

కరోనా వైరస్ ఎఫెక్ట్, భారత వృద్ధి రేటును భారీగా తగ్గించిన రేటింగ్ సంస్థలు | Fitch cuts India growth forecast to 4.9 percent

Fitch Ratings on Monday cut its forecast for India's economic growth to 4.9 per cent in the current fiscal on weak domestic demand and supply chain disruptions due to the coronavirus outbreak.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X