ముంబై: ఆర్థిక దుబారా వల్ల సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. మంగళవారం టైమ్స్ నెట్ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. నిర్ణీత స్థాయిలోనే ద్రవ్యలోటును కట్టడి చేయాలని లేదంటే సంక్షోభం తప్పదన్నారు.

ద్రవ్యలోటు ఎక్కువే ఉంటుంది
చెల్లింపుల్లో ఇబ్బందులు రాకుండా ఆర్థిక వ్యయాలు ఉండాలని సుబ్బారావు సూచించారు. ఇందుకు ద్రవ్యలోటు లక్ష్యంలోపే పరిమితమయ్యేలా చూడాలని చెప్పారు. ద్రవ్యలోటు పరిమాణంతో పాటు వాస్తవ గణాంకాలు కూడా ముఖ్యం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన దాని కంటే వాస్తవ ద్రవ్యలోటు అధికంగానే ఉంటుందన్నారు. ద్రవ్యలోటు వల్ల ద్రవ్యోల్భణం పెరుగుతుందని, ప్రయివేటు పెట్టుబడులు హరించుకుపోతాయని, అన్ని ఆశ్తులకు పూచి ఇచ్చే స్థాయి తగ్గిపోతుందని, కరెంట్ ఖాతా లోటు సమస్యలకి కారణమవుతుందన్నారు.

ఆర్థిక దుబారా వల్లే... 1991, 2013లో అలా ప్రమాదం వచ్చింది
1991లో చెల్లింపుల సంక్షోభం ఎదురైందని, 2013లో రూపాయి మారకం రూపంలో ప్రమాదం వచ్చి పడిందని, ఇవన్నీ రావడానికి ఆర్థిక దుబారానే కారణమన్నారు. అందువల్ల ద్రవ్యలోటు లక్ష్యంలోపు ఉండేలా చర్యలు తీసుకోవాలని మోడీ ప్రభుత్వానికి హితవు పలికారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వాలు రుణాలు మంజూరు చేయడం సరైన చర్య అన్నారు. అయితే మరింత తక్షణ అవసరాల కోసం కనుక రుణాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం వాటిల్లుతుందన్నారు.

విదేశీ చెల్లింపుల సంక్షోభం ఏర్పడుతుంది
ప్రభుత్వం ద్రవ్యలోటును నిర్దేశించుకున్న లక్ష్యం పరిధిలో ఉండేలా తప్పకుండా చూసుకోవాలని సుబ్బారావు సూచించారు. అలా చేయని పక్షంలో సంక్షోభంలో చిక్కుకోవలసి వస్తుందన్నారు. ద్రవ్యలోటు ఇంకా ఆర్థిక సంవత్సరం అయిదు నెలలు ఉండగానే 107% దాటి 3.4% చేరిందనే వార్తల నేపథ్యంలో ఆయన ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ద్రవ్యలోటు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ప్రయివేటు పెట్టుబడులు వెళ్లిపోతాయని, దీంతో విదేశీ చెల్లింపుల సంక్షోభం కూడా ఏర్పడుతుందన్నారు. బడ్జెట్ లక్ష్యాలకు దూరంగా ద్రవ్య లోటు ఉందన్న ప్రభుత్వ వివరాల నేపథ్యంలో.. లక్ష్యాలను సాధించాలని ఆయన అన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications