ఇండియాకు పాఠం, చైనా నుండి దారిమార్చి.. వియత్నాంకు కంపెనీలు: కారణాలేమిటి?

ఇటీవలి కాలంలో చైనా నుండి చాలా కంపెనీలు ఇతర దేశాలకు తరలి వెళ్తున్నట్లుగా వార్తలు వింటూనే ఉన్నాం. దీనికి కరోనా మహమ్మారి ఒక్కటే కారణం కాదు. గత ఏడాది అమెరికా - చైనా ట్రేడ్ వార్ నుండి ప్రారంభిస్తే కరోనా వరకు వివిధ కారణాలతో కంపెనీలు బీజింగ్‌ను వదిలేందుకు సిద్ధమయ్యాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన క్వాలిటీ కంట్రోల్ అండ్ సప్లై చైన్ ఇన్‌స్పెక్షన్ కంపెనీ 'కీమా' ప్రకారం ఉత్తర అమెరికా, యూరోపియన్ కొనుగోలుదారుల అకస్మిక ఇన్‌స్పెక్షన్, ఆడిట్ డిమాండ్ పెరగడమూ కారణమే.

చైనా నుండి బయటకు కంపెనీలు

చైనా నుండి బయటకు కంపెనీలు

వివిధ కారణాలతో చైనా నుండి పెద్ద ఎత్తున కంపెనీలు తమకు అనుకూలంగా ఉన్న ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. ఇలాంటి ఇన్‌స్పెక్షన్స్, ఆడిట్ రిపోర్ట్స్ వల్ల కంపెనీలు కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతాయి. కీమా నివేదిక ప్రకారం ఈ కంపెనీల్లో 45 శాతం సౌత్ ఈస్ట్ ఏషియా (వియత్నాం, మయన్మార్, పిలిప్పైన్స్ వంటివి), 52 శాతం సౌత్ ఏషియాకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నాయి. టెక్స్‌టైల్స్, అప్పారెల్ బ్రాండ్స్ బంగ్లాదేశ్ వైపు చూస్తున్నాయి.

చైనా నుండి అందుకే బయటకు

చైనా నుండి అందుకే బయటకు

కరోనా మహమ్మారి వెలుగు చూసిన జనవరి, ఫిబ్రవరి కాలంలోను కంపెనీలు మార్పుకు మొగ్గు చూపాయి. అయితే కరోనాతో పాటు ఇతర కారణాలు ఉన్నాయి. మార్చిలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత స్థానిక మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. ఇన్‌స్పెక్షన్, ఆడిట్ వ్యాల్యూమ్స్ 2019 స్థాయికి చేరుకున్నాయి. అయితే మార్చి 23 నాటికి పుంజుకోవడం తగ్గింది. మార్చి 23 నాటికి ఇన్‌స్పెక్షన్స్, ఆడిట్ వ్యాల్యూమ్స్ 19 శాతం పడిపోయాయి. అమెరికా, యూరోప్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రభావం పడింది.

మరో కారణం ఏమంటే కీమా పోల్ చేసిన పోల్‌లో 200 కంపెనీల్లో 87 శాతం కరోనా మహమ్మారి ప్రపంచ సరఫరా గొలుసులో గణనీయమైన మార్పులు తీసుకు వస్తోందని పేర్కొన్నారు. కరోనా ప్రభావం లేని ప్రాంతాలకు మారడం బెట్టర్ అని 50 శాతానికి పైగా అభిప్రాయపడ్డారు.

అంతకుముందు నుండి అమెరికాతో ట్రేడ్ వార్ ప్రభావం కూడా ఉంది.

చైనా నుండి షిఫ్ట్.. ఇండియా ఆకర్షిస్తుందని...

చైనా నుండి షిఫ్ట్.. ఇండియా ఆకర్షిస్తుందని...

చైనా నుండి కంపెనీలు ఇతర దేశాలకు తరలి వెళ్లడం గత కొంతకాలంగా సాగుతోంది. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ ట్రంప్ ఓడిపోయినా ఇది కొనసాగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇరుదేశాల మధ్య వాణిజ్య అంశంపై సంక్లిష్టత నెలకొంది. అంతేకాకుండా అదనంగా ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలతో చైనాకు ట్రేడ్ ఇష్యూస్ ఉన్నాయి. చైనా నుండి కంపెనీల షిఫ్ట్ సెంటిమెంట్ ఇండియాకు మరిన్ని పెట్టుబడులు వస్తాయనే ఆశలు కలిగాయి. పెద్ద ఎత్తున కంపెనీలను చైనా నుండి ఆకర్షిస్తుందని భావించారు.

చైనా నుండి దారిమార్చిన కంపెనీలు, ఇండియాకు కాదు..

చైనా నుండి దారిమార్చిన కంపెనీలు, ఇండియాకు కాదు..

చైనా నుండి వ్యాపారాలను లేదా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇండియా 4.62 హెక్టార్ల భూమిని కూడా గుర్తించినట్లు మే నెలలో వార్తలు వచ్చాయి. ఇండియాలోకి కంపెనీలు వచ్చేందుకు అమెరికాకు చెందిన దాదాపు వెయ్యికి పైగా కంపెనీలు సంప్రదింపులు జరిపినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. చైనా నుండి వచ్చే కంపెనీలను ఆకర్షించేందుకు ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి. కానీ అలా చైనా నుండి తరలి వెళ్తున్న కంపెనీలు ఇండియాకు రావడం లేదు.

56 కంపెనీల్లో ఇండియాకు 3 మాత్రమే

56 కంపెనీల్లో ఇండియాకు 3 మాత్రమే

జపాన్ ఫైనాన్షియల్ గ్రూప్ నోమురా ప్రకారం చైనా నుండి వెళ్తున్న కంపెనీలు ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా వైపు చూస్తున్నాయి. 2018-19లో చైనా నుండి 56 కంపెనీలు తరలి వెళ్లగా ఇందులో 26 కంపెనీలు వియత్నాంకు వెళ్లడం గమనార్హం. 11 తైవాన్‌కు, 8 థాయ్‌లాండ్‌కు వెళ్లగా,ఇండియాకు వచ్చిన కంపెనీలు కేవలం 3 మాత్రమే. కంపెనీలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని కీమా నివేదిక వెల్లడించింది.

సురక్షితం అంటే..

సురక్షితం అంటే..

ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు అంటే కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా లేకపోవడం లేదా ఈ వైరస్‌ను బలంగా ఎదుర్కొన్న దేశాలు అని అర్థం. కరోనాపై పోరులో వియత్నాం చాలా దేశాల కంటే ముందుంది. ఈ దేశంలో కరోనా కేసులు కేవలం 332 మాత్రమే. మరణాలు ఒక్కటి కూడా నమోదు కాలేదు. దాదాపు 10 కోట్ల జనాభా కలిగిన వియత్నాం కరోనాపై పోరులో అద్భుత విజయం సాధించింది. వియత్నాంతో పోలిస్తే దాదాపు అంతే జనాభా కలిగిన పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 9,000 కరోనా కేసులు ఉండగా, 400కు పైగా మరణాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వియత్నాం కేసుల కంటే కేవలం పశ్చిమ బెంగాల్ కేసులు పెరుగుతున్నాయి.

వియత్నాం ఒప్పందాలు.. భారత్‌కు దూరం

వియత్నాం ఒప్పందాలు.. భారత్‌కు దూరం

పెట్టుబడులకు మరింత ఆకర్షణీయంగా మారేందుకు గాను వియత్నాం సోమవారం యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా వియత్నాం నుండి ఎగుమతి అయ్యే వస్తువులపై 85 శాతం టారిఫ్ సుంకాన్ని తొలగించడం వంటి అంశాలు ఉన్నాయి. ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులకు తోడు వివిధ కారణాల వల్ల చైనా నుండి తరలి వెళ్తున్న కంపెనీలు భారత్ వైపు చూడడం లేదని భావిస్తున్నారు. చైనా తర్వాత అత్యంత జనాభా కలిగిన దేశం భారత్. కాబట్టి ఇక్కడ అతిపెద్ద మార్కెట్ ఉంది. కాబట్టి అతిపెద్ద మార్కెట్ ఒక్కటే కంపెనీలు రావడానికి కారణంగా కనిపించడం లేదని అర్థమవుతోందంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+