మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో ఫినోలెక్స్ కేబుల్ కంపెనీ ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించింది. దీంతో ఫినోలెక్స్ కేబుల్స్ షేర్లు శుక్రవారం ఇంట్రా-డే డీల్స్‌లో 14 శాతం పెరిగి దాని రికార్డు గరిష్ట స్థాయి రూ.1,308.25కి చేరుకున్నాయి. ఫినోలెక్స్ నాల్గో త్రైమాసికానికి సంస్థ దాని ఏకీకృత నికర లాభంలో సంవత్సరానికి 6.3 శాతం (YoY) వృద్ధిని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం 23 శాతం పెరిగింది.
అదే సమయంలో కార్యకలాపాల ద్వారా దాని ఆదాయం Q4FY24లో 18.3 శాతం పెరిగి రూ.1,450.69 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం సంబంధిత కాలంలో ఇది రూ.1,226.14 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.772.30 నుంచి ఇప్పుడు 69 శాతం పెరిగింది. గత 1 సంవత్సరంలో 33 శాతం పెరగ్గా.. 2024లో 22 శాతానికి పైగా పెరిగింది. ఏప్రిల్‌లో 5.2 శాతం, మార్చిలో 8.7 శాతం పెరిగింది. అయితే ఫిబ్రవరిలో 15.6 శాతం పడిపోయింది.

నిర్వహణ స్థాయిలో సమీక్షిస్తున్న త్రైమాసికంలో EBITDA 11.2 శాతం పెరిగి రూ.145.7 కోట్ల నుంచి రూ.162 కోట్లకు చేరుకుంది. రిపోర్టింగ్ త్రైమాసికంలో EBITDA మార్జిన్ గత ఏడాది 11.9 శాతంతో పోలిస్తే 11.6 శాతంగా ఉంది. అంతేకాకుండా, మార్చి 31, 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి రూ.8 డివిడెండ్ ఇవ్వాలని బోర్డు సిఫార్సు చేసింది. మొత్తంమీద 2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY24), కంపెనీ నికర లాభం FY23లో రూ.501.74 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ.571.60 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications