క్రిప్టో కరెన్సీలపై విధించే పన్నుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయాలని గురువారం ప్రభుత్వం ప్రతిపాదించింది. క్రిప్టో నష్టాలను ఇతర వర్చువల్ డిజిటల్ ఆస్తులలో వచ్చిన లాభాలతో పూడ్చుకోవడానికి అనుమతి నిరాకరించడం ఇందులో భాగం. ఫైనాన్స్ బిల్ 2022కి చేస్తున్న సవరణల ప్రతిపాదనల ప్రకారం నష్టాలను వర్చువల్ డిజిటల్ ఆస్తుల నుండి వచ్చిన లాభాలతో పూడ్చుకునే విషయంలో ఇతర అనే పదాన్ని తొలగిస్తుంది. అంటే వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదలీ వల్ల వచ్చిన నష్టాన్ని ఇతర వీడీఏల వల్ల ఆదాయం ద్వారా పూడ్చుకోలేరు.
వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టో కరెన్సీలు, ఎన్ఎఫ్‌టీలు)లో లాభాలు తీసుకొని, రిటర్న్స్‌లో ఆ విషయాన్ని వెల్లడించకపోతే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు రావొచ్చు. ఎందుకంటే వర్చువల్ డిజిటల్ అసెట్స్ ట్రాన్సాక్షన్స్‌ను 30 శాతం పన్ను పరిధిలోకి తీసుకు వస్తు 2022-23 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేర్చింది. దీని ప్రకారం క్రిప్టోల లాభంపై 30 శాతం పన్ను చెల్లించవలసి వస్తుంది. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది.

ఇప్పటి వరకు ఈ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి పన్ను చెల్లింపుదారులు స్వయంగా రిటర్న్స్‌లో వెల్లడించేవారు. స్వయంగా కోరి తీసుకుంటే తప్ప ఆదాయపు పన్ను శాఖకు ఆ ట్రాన్సాక్షన్స్ వివరాలు తెలియకపోయేవి. అయితే ఇక మీదట స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ మాదిరి వర్చువల్ డిజిటల్ సెట్స్ ట్రాన్సాక్షన్స్ వివరాలు కూడా ఆటోమేటిగ్గా ఆదాయపు పన్ను శాఖకు వెళ్తాయి. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం అన్ని బ్యాంకులు, క్రిప్టో ఎక్స్చేంజీలకు వర్చువల్ డిజిటల్ అసెట్స్ ట్రాన్సాక్షన్స్ వివరాలను నివేదించాలని కోరనున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications