మన దేశంలో ఇప్పటికే పని గంటల పై రచ్చ జరుగుతుంది. అంతేకాదు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై చాల విమర్శలు కూడా వచ్చాయి. దీనికి తోడు మన దేశంలో ఒక ఉద్యోగి, కనీస వేతనం గురించి కూడా చర్చ మొదలైంది. ఈ సమయంలో ఫిన్లాండ్ వరుసగా 8వ సారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా అవతరించింది. ఈ విషయాన్నీ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ద్వారా వెల్లడైంది. అయితే ఫిన్లాండ్ ప్రజలు సంతోషంగా ఉండటానికి చాలా నేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ సామాజిక భద్రత అలాగే ప్రజలు ఒకరినొకరు ఎక్కువగా నమ్ముతారు. ఇంకా ప్రభుత్వం కూడా ప్రజల భద్రత పూర్తిగా చూసుకుంటుంది. అందుకే అక్కడి ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. మనం ఫిన్లాండ్‌ను భారతదేశంతో పోల్చితే అక్కడ పని గంటలు తక్కువగా ఉంటాయి ఇంకా జీతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, భారతదేశంతో పోలిస్తే ఫిన్లాండ్‌లో పనిచేసే వ్యక్తికి ఎక్కువ హాలిడేస్ లభిస్తాయి. అయితే కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత భారతదేశం ఫిన్లాండ్ కంటే చాలా ఉత్తమం అని చెప్పవచ్చు.

ఫిన్లాండ్ ప్రజల ప్రస్తుత జీవితాలు : ఫిన్లాండ్ స్థిరంగా అగ్రస్థానంలో ఉండటానికి అక్కడి జీవన నాణ్యత, సామాజిక మద్దతు ఇంకా వర్క్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇవన్నీ ఫిన్లాండ్‌ను ఎల్లప్పుడూ సంతోషమైన నగరంగా ఉంచడానికి సహాయపడతాయి. "ఫిన్లాండ్ సంతోషంగా, ఆనందంగా ప్రజలు, వీధుల్లో డాన్స్ చేసే చక్కటి దేశం లాంటిది" అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్, వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్ లీడర్ ఇంకా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఎడిటర్ జాన్-ఇమ్మాన్యుయేల్ డి నీవ్ Fortune.comతో అన్నారు. ఈ లిస్టులో భారతదేశం స్థానం ఏంటి: ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాలలో ఇండియా ర్యాంకింగ్‌లో కొంత మెరుగుదల ఉంది. 2024లో భారతదేశం 126వ స్థానంలో ఉండగా, 2025 నాటికి 118వ స్థానానికి చేరుకోవచ్చు. 147 దేశాల ప్రజల జీవన నాణ్యత, వారి సంతోషం ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందించారు. ప్రపంచంలోనే అత్యంత అసంతృప్తికరమైన దేశంగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఆఫ్ఘన్ మహిళలు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
భారతదేశంలో ఎక్కువ పని గంటలు: మనం భారతదేశం అలాగే ఫిన్లాండ్‌ను పోల్చి చూస్తే భారతదేశంలో ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది. భారతదేశంలోని చాలా కంపెనీలలో ప్రజలు వారానికి 48 గంటలు పని చేస్తారు. అంటే వారానికి 6 రోజులు రోజుకు 8 గంటలు పని చేసి, ఒక రోజు సెలవు తీసుకోవాలి. అయితే ఫిన్లాండ్‌లో ప్రజలు వారానికి గరిష్టంగా 40 గంటలు పని చేస్తారు. చాలా కంపెనీలలో వారానికి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది. అది కూడా రోజుకు 8 గంటలు. ఇది కాకుండా ఫిన్లాండ్‌లోని ఉద్యోగులకు సంవత్సరంలో 24 నుండి 30 స్పెషల్ హాలిడేస్ లభిస్తాయి. వీటిని వెకేషన్ హాలిడేస్ అంటారు. ఈ కాలంలో ఒక వ్యక్తి పని చేయాలనుకుంటే అతనికి రోజులకు లెక్కన కంపెనీ జీతం చెల్లిస్తుంది. భారతదేశంలో కూడా సెలవులు ఉంటాయి, కానీ ఒక ఉద్యోగి ఈ రోజుల్లో పనిచేస్తే, చాలా తక్కువ కంపెనీలు మాత్రమే జీతం చెల్లిస్తాయి.
మీకు ఎంత జీతం వస్తుంది: ఫిన్లాండ్ మరియు భారతదేశంలో జీతాలు ఉద్యోగాన్ని బట్టి మారవచ్చు. కానీ ఫిన్లాండ్‌లో సగటు జీతాలు ఎక్కువగా ఉంటాయి. లివింగ్‌కాస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, ఫిన్లాండ్‌లో పన్ను తర్వాత సగటు నెలవారీ జీతం $2732 (రూ. 2.36 లక్షలు). భారతదేశంలో ఈ జీతం నెలకు 625 డాలర్లు (సుమారు 54 వేల రూపాయలు). అటువంటి పరిస్థితిలో, ఫిన్లాండ్‌లో సగటు జీతం భారతదేశం కంటే 4 రెట్లు ఎక్కువ.
ఈ విషయాల్లో భారతదేశం బెస్ట్ : మరోవైపు ఇలాంటి విషయాల్లో ఇండియా గురించి తెలుసుకుంటే భారతదేశం చాలా మెరుగ్గా ఉందని భావిస్తారు. ఫిన్లాండ్‌లో తలసరి జీవన వ్యయం $1521 అయితే భారతదేశంలో కేవలం $429 మాత్రమే. దీని ప్రకారం, భారతదేశంలో అద్దె పై జీవించడం చౌకగా ఉంటుంది. ఫిన్లాండ్‌లో ఒక వ్యక్తికి టికెట్ ధర $719 కాగా, భారతదేశంలో కేవలం $175 మాత్రమే. ఇవి కాకుండా, భారతదేశంలో ఆహార ఖర్చులు, రవాణా ఖర్చులు, కుటుంబ అద్దె మొదలైనవి కూడా తక్కువగా ఉన్నాయి.
More From GoodReturns

Labour code: కొత్త లేబర్ కోడ్! 50% బేసిక్ పే రూల్‌తో మీ జీతం ఎలా మారబోతోంది? పూర్తి వివరాలు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications