ప్రస్తుతం బంగారం ధరలు మళ్ళీ కొండ దిగి కిందికి వస్తుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు గోల్డ్ షాపుల వైపు చూస్తున్నారు. నేడు ధరలు భారీగా పడిపోయాయి.
గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు అదే పంధాను కొనసాగిస్తున్నాయి. విపరీతంగా బంగారం ధరలు పెరిగి కొనుగోలు చేయలేనంతగా కొండెక్కి కూర్చున్న పరిస్థితులలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇక బంగారాన్ని కొనుగోలు చేయలేమంటూ బంగారంపై ఆశలు వదిలేసుకున్నారు. రెండేళ్ల గరిష్టానికి బంగారం ధరలు పెరగడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం బంగారం ధరలు మళ్ళీ కొండ దిగి కిందికి వస్తుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు గోల్డ్ షాపుల వైపు చూస్తున్నారు.

భారీగా బంగారం ధరల తగ్గుదల .. పసిడి ప్రియులకు పండుగ..
అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపుదలతో బంగారం రేట్లు తగ్గాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లోను బంగారం ధరల తగ్గుదల కనిపిస్తుంది. ఇదిలా ఉంటే దేశీయ మార్కెట్లోనూ తగ్గిన బంగారం ధరలు పసిడి ప్రియులకు పండుగ వాతావరణం కల్పిస్తున్నాయి. తగ్గుతున్న బంగారం ధరలతో బంగారు ఆభరణాలు కొనుగోలు పై ఆశలు చిగురిస్తున్నాయి. భారతదేశంలో ఉన్న మహిళలకు బంగారం అంటే ఎనలేని ప్రీతి. వివాహ ది శుభకార్యాలైన, వేడుకలైన, సందర్భం ఏదైనా సరే బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందే. అటువంటి వారంతా ఇటీవల బంగారం ధరలతో పసిడిపై కాస్త విముఖత వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడిప్పుడే బంగారం వైపు దృష్టి సారిస్తున్నారు.

హైదరాబాద్ లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేడు ధరలిలా
ఇక తాజాగా నేడు బంగారం ధరలను చూసినట్లయితే హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,500గా ఉంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,180 గా ట్రేడ్ అవుతుంది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి హైదరాబాదులో 51,700 ధర ఉంది. నేడు 200 రూపాయలు 22 క్యారెట్ల బంగారం మీద తగ్గింది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి హైదరాబాదులో ధర 56,510 గా ఉంది. నేడు ఏకంగా 330 రూపాయల మేర బంగారం ధర తగ్గింది. ఇక భారీగా బంగారం తగ్గుదలతో మళ్లీ బంగారం ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయి అన్న ఆలోచన కలుగుతుంది.

ఢిల్లీ, ముంబై, విజయవాడ, విశాఖలలో నేడు బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,650 గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,330 రూపాయలుగా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,500 ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,180 గా ట్రేడ్ అవుతుంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 51,500గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,180గా కొనసాగుతుంది. విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,500గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,180 గా కొనసాగుతుంది.

బెంగుళూరు, చెన్నై లలో ధరలిలా
ఇక బెంగళూరులో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,550 గా ప్రస్తుతం అమ్ముడు అవుతుంటే ,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 56,230గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఒక దేశంలోనే ధరలు ఎక్కువగా ఉండే చెన్నై తో పాటు మధురై, కోయంబత్తూర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52100 గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,840 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మొత్తంగా చూస్తే బంగారం ధరలు తగ్గుదల పసిడి ప్రియులకు ఒక పండుగలాగా కనిపిస్తుంది. మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం అని నిపుణులు చెబుతుంటే బంగారం షాపులకు పరుగులు పెడుతున్నారు గోల్డ్ లవర్స్.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications