జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన: పథకానికి వీరంతా అర్హులే, ఎవరికి ఎంత ఇస్తారంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బుధవారం పలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కొత్త పథకాలతో పాటు కీలక అంశాలపై చర్చించారు. కాపుల కోసం కొత్త పథకం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల సంఖ్య పెంపు, కొత్త రేషన్ కార్డులు, వైయస్సార్ నవశకంతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో అందరికీ ఫీజు రీయింబర్సుమెంట్స్ ప్రకటించారు. ఆదాయ పరిమితిని సవరించారు. కొత్త నిర్ణయాల మేరకు మరింతమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఫీజు రీయింబర్సుమెంట్స్ కోసం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేరుతో ఇస్తున్నారు. ఈ రెండు పథకాల గురించి....

ఫీజు రీయింబర్సుమెంట్స్ భారీ ఊరట
- అన్ని సామాజిక వర్గాలకు ఎలాంటి మినహాయింపులు లేకుండా 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు.
- ఇందుకు ఆదాయ పరిమితిని అన్ని వర్గాలకు సమం చేస్తూ కేబినెట్ తీర్మానం.
- ఫీజు రీయింబర్సుమెంట్ కోసం జగనన్న విద్యా దీవెన పేరుతో రూ.3,400 కోట్లు కేటాయింపు. గత ప్రభుత్వం రూ.1800 కోట్లు వెచ్చించింది.

జగనన్న దీవెన వార్షికాదాయ పరిమితి
- హాస్టల్స్‌లో మెరుగైన సౌకర్యాల కోసం జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన కింద ఏడాదికి రూ.5,700 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం.
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనార్టీ వర్గాల వారికి, దివ్యాంగులకు విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్సుమెంట్.
- బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే, బీఈడీ వంటి కోర్సులకు కూడా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్సుమెంట్స్
- ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఆపై కోర్సులను ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు కాలేజీలు, యూనివర్సిటీలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పథకం వర్తింపు.

వీరికి పథకం వర్తింపు...
- పది ఎకరాల లోపు మాగాణి లేదా 25 ఎకరాల లోపు మెట్ట ఉన్న వారికి లేదా ఈ రెండూ కలిపి 25 ఎకరాల లోపు ఉన్న వారికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు వర్తింపు.
- పట్టణాల్లో 1500 చ.అ. లోపు స్థిరాస్థి ఉన్న వారికి పథకం వర్తింపు
- ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
- ట్యాక్సీ, ఆటో, ట్రాక్డర్ నడుపుతూ జీవిస్తున్న కుటుంబాల వారికి ఆదాయ పరిమితి నిబంధన మినహాయింపు.

వీరికి ఆదాయ పరిమితి నిబంధన మినహాయింపు
- హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద ఆర్థిక సాయం.
- ఈ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏటా రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏటా రూ.15వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు చదివే వారికి ఏటా రూ.20 వేలు,

ఎప్పుడు చెల్లిస్తారంటే?
- ప్రతి ఏటా జూన్ నెలలో 50 శాతం చెల్లిస్తారు.
- ఆ తర్వాత డిసెంబర్ నెలలో మిగతా 50 శాతం చెల్లింపులు
- ఈ మొత్తాన్ని కూడా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
- ఈ పథకానికి ఏటా రూ.2300 కేటాయింపు. గత ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది.

రెండు పథకాలకు కలిపి రూ.5,700 కోట్లు
- జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన స్కీంల కింద ఇప్పటి వరకు లబ్ధిదారుల సంఖ్య 11,44,490 మంది.
- రెండు పథకాలకు ప్రస్తుతానికి రూ.5,700 కోట్లు అవసరం.
- నిబంధనల సడలింపుతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.


Click it and Unblock the Notifications