తిరువనంతపురం: దేశాన్ని చుట్టుముట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత లక్షలాదిమందిని రోడ్డున పడేసింది. లాక్‌డౌన్ తరహా పరిస్థితుల వల్ల పలువురు తమ ఉపాధిని కోల్పోయారు..రోడ్డున పడ్డారు. ఆర్థిక రంగం ఎత్తుపల్లాలను ఎదుర్కొంటోంది. గతుకుల రోడ్ల మీద సాగుతోంది. ఈ మహమ్మారి తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టినప్పటికీ.. అది మిగిల్చిన సంక్షోభం మరిన్ని రోజులు కొనసాగే ప్రమాదం లేకపోలేదు. లాక్‌డౌన్ వల్ల మూతపడిన పరిశ్రమలు, చిన్న తరహా తయారీ యూనిట్లు మళ్లీ గాడిన పడాలంటే మార్కెట్ పుంజుకోవాల్సి ఉంటుంది. పూర్వవైభవాన్ని సంతరించుకోవాల్సి ఉంటుంది.

ఫెడరల్ బ్యాంక్ సరికొత్త చర్యలు..
అనేక మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ బ్యాంక్ (Federal Bank) సరికొత్త చర్యలు తీసుకుంది. వందల మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. కేరళలో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా పార్ట్‌టైమ్ ఉద్యోగాలను సృష్టించింది ఫెడరల్ బ్యాంక్. నిరుద్యోగులకు వాటిని కేటాయించింది.. రిక్రూట్ చేసుకుంది కూడా. ఇప్పటిదాకా 400 మందికి పైగా యువతకు ఉపాధిని కల్పించినట్లు ప్రకటించింది. కేరళ వ్యాప్తంగా ఉన్న తమ శాఖా కార్యాలయాల్లో వారిని నియమించినట్లు వివరించింది.

400 మందికి పైగా పార్ట్‌టైమ్ జాబ్స్..
పార్ట్‌టైమ్ ఉద్యోగాల కింద 400 మందికి పైగా ఉపాధిని కల్పించామని, వారందరినీ కోవిడ్ వార్డెన్స్‌గా హోదా కల్పించినట్లు ఫెడరల్ బ్యాంక్ ముఖ్య మానవ వనరుల విభాగాధిపతి అజిత్ కుమార్ కేకే తెలిపారు. ప్రతి నెలా 18 వేల రూపాయల మొత్తాన్ని వేతనంగా అందజేయనున్నట్లు చెప్పారు. దీనికోసం ఆరు కోట్ల రూపాయలను కేటాయించామని అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద దీన్ని చేపట్టామని పేర్కొన్నారు. బ్యాంకు కార్యాలయాలకు వచ్చే ఖాతాదారులను క్రమబద్దీకరించడం, వారికి మాస్కులు, శానిటైజర్లను అందించడం వారి డ్యూటీగా నిర్దారించామని అన్నారు.

సీఎస్ఆర్ కింద రూ.40 కోట్లు
ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మొత్తం 35 కోట్ల రూపాయలను కేటాయించామని, ఇందులో నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో 100 ఐసీయూ బెడ్స్‌ను ఆసుపత్రులకు అందజేసినట్లు వివరించారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అయిదు జిల్లాల్లో సంజీవినీ వెహికల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, వాటి ద్వారా టీకాపై ప్రచారం చేస్తోన్నామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021-2022లో ఈ మొత్తాన్ని 40 కోట్ల రూపాయల మేరకు పెంచాలని నిర్ణయించినట్లు అజిత్ కుమార్ కేకే తెలిపారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications