For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదే జరిగింది.. భారీగా తగ్గిన బంగారం ధరలు, కారణమిదే

|

బంగారం ధరలు గురువారం(సెప్టెంబర్ 17) తగ్గుముఖం పట్టాయి. పరిస్థితులు కుదుటపడేవరకు దాదాపు 2023 ఏడాది వరకు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతామని ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. అమెరికా డాలర్ బలపడింది. కరోనా కేసులు తగ్గి, రికవరీ పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సీన్ ప్రయోగాలు తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గి, ధరలు తగ్గుముఖం పట్టాయి. కరోనా కారణంగా మార్చి నుండి పసిడి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఎంసీఎక్స్‌లో రూ.56,200కు పైన, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 2,072కు పైన పలికాయి. వ్యాక్సీన్ రాక నేపథ్యంలో గత నెల రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి.

బంగారం రూ.52,000 వద్ద ఆగిపోతుందా, మార్చి దిశగా సాగుతోందా?బంగారం రూ.52,000 వద్ద ఆగిపోతుందా, మార్చి దిశగా సాగుతోందా?

రూ.500కు పైగా తగ్గిన పసిడి ధర

రూ.500కు పైగా తగ్గిన పసిడి ధర

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఈరోజు గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.85 శాతం తగ్గి రూ.51,391కి చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 1.4 శాతం తగ్గి రూ.67,798కి చేరుకుంది. నిన్న రూ.52వేల సమీపానికి చేరుకున్న పసిడి ఈరోజు రూ.51,400 దిగువకు వచ్చింది. రూ.500కు పైగా తగ్గింది. వెయ్యి కిలో కూడా రూ.1000కి పైగా తగ్గింది. గత రెండు వారాలుగా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి. అయితే ఫెడ్ రిజర్వ్ ప్రకటనకు ముందు గత రెండు మూడు నాలుగు రోజులుగా స్వల్పంగా పెరుగుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే వేగంగా కోలుకుంటుందని, నిరుద్యోగం తగ్గుతోందని ఫెడ్ రిజర్వ్ ప్రకటించడం బంగారం ధర తగ్గుదలకు కారణమయ్యాయి.

హైదరాబాద్, విజయవాడల్లో ధరలు

హైదరాబాద్, విజయవాడల్లో ధరలు

ఫెడ్ రిజర్వ్, డాలర్, కరోనా రికవరీ పెరగడం సహా వివిధ కారణాలతో బులియన్ మార్కెట్లో బంగారం ధరకు బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్, విశాఖ,విజయవాడలో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర తగ్గడంతో రూ. రూ.54,000 దిగువకు వచ్చింది. రూ.53,950 పలికింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.49,450 పలికింది. వెండి కిలో కూడా రూ.500 వరకు తగ్గి రూ.69వేలకు దిగి వచ్చింది. బంగారం ధరలు ఇటీవల స్వల్పంగా పెరుగుదల నమోదు చేసినప్పటికీ, రూ.52వేల వద్దే ఆగిపోతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ స్థాయి నుండి పడిపోవడం గమనార్హం.

డాలర్, ఫెడ్ రిజర్వ్ ఎఫెక్ట్

డాలర్, ఫెడ్ రిజర్వ్ ఎఫెక్ట్

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ 0.3 శాతం క్షీణించి 1,954.42 డాలర్లు పలికింది. నిన్న ఓ సమయంలో ధర 1,973.16 డాలర్లు పలికింది. సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత గరిష్ట ధరకు చేరుకొని, తర్వాత క్షీణించింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం తగ్గి ఔన్స్ 1,962.90 డాలర్లు పలికింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ ఇండెక్స్ 0.1 శాతం పెరిగింది. దీంతో ఈ బాస్కెట్‌లోని ఇతర కరెన్సీల్లో బంగారం ధర పెరుగుతుంది. ఈవారం యూఎస్ ట్రెజరీ హోల్డింగ్స్ ఈ వారం రికార్డ్ హైకి చేరుకున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ జూన్‌లో ఊహించిన దానికంటే వేగంగా పుంజుకుంటుందని, అలాగే నిరుద్యోగం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అమెరికా ఫెడ్ రిజర్వ్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈక్విటీలు పుంజుకొని, బంగారంపై ఒత్తిడి తగ్గింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.8 శాతం తగ్గి ఔన్స్ ధర 27 డాలర్లకు, ప్లాటినమ్ 0.9 శాతం తగ్గి 959.85 డాలర్లకు, పల్లాడియం 0.9 శాతం తగ్గి 2,378.86 డాలర్లకు క్షీణించింది.

పసిడి ధరలు గరిష్టం.. కనిష్టం

పసిడి ధరలు గరిష్టం.. కనిష్టం

నిన్న పసిడి ధరలు గరిష్టం ఔన్స్ 1973.64, కనిష్టం 1949.93, గతవారం గరిష్టం 1966.54, కనిష్టం 1906.62, మంత్లీ గరిష్టం 2075.32, మంత్లీ కనిష్టం 1863.24గా ఉంది. కాగా, ప్రపంచ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ SPDR ETF వద్ద బంగారం పెట్టుబడులు 0.42 శాతం తగ్గి 1247.569 టన్నులకు చేరుకుంది. జూలై 31 తర్వాత ఇది కనిష్టం.

English summary

అదే జరిగింది.. భారీగా తగ్గిన బంగారం ధరలు, కారణమిదే | Fed affect: Gold price today down to Rs 51,400 per 10 gm

Gold prices eased on Thursday as the U.S. dollar firmed, although doubts over a swift global economic recovery and the Federal Reserve's pledge to hold interest rates near zero until at least 2023 limited losses for the safe-haven metal.
Story first published: Thursday, September 17, 2020, 10:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X