FASTag వార్షిక పాస్ అందరికీ ఉపయోగమా? తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!

నేషనల్ హైవేపై తరచూ ప్రయాణించే వారి కోసం FASTag వార్షిక పాస్ ను ప్రవేశపెట్టారు. ఇది ప్రయాణాల ఖర్చును తగ్గించడమే కాకుండా, టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే, ఈ పాస్ తీసుకునే ముందు కొన్ని పరిమితులు, నిబంధనలను ఖచ్చితంగా తెలుసుకోవాలి.

FASTag Annual Pass Who Should Buy It and What to Know Before You Do

FASTag వార్షిక పాస్ అంటే ఏమిటి?
FASTag వార్షిక పాస్ అనేది తరచూ టోల్ ప్లాజాల మీదుగా ప్రయాణించే వాహనదారుల కోసం రూపొందించిన ప్రీ-పెయిడ్ సౌకర్యం. ఇది ఒక నిర్దిష్ట రూట్‌కు మాత్రమే వర్తించగలదు, వాహనం యొక్క తరచు ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని, వార్షిక చెల్లింపుతో అపరిమిత ప్రయాణాలకు అనుమతి ఇస్తుంది (పరిమిత వ్యాలిడిటీ). ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ 2025, ఆగస్ట్ 15 నుండి అమలులోకి రానుంది. ఈ వార్షిక పాస్ వల్ల మనం ప్రయాణాలను మరియు ఖర్చులను ట్రాక్ చేసుకోవచ్చు. ప్రతిసారీ టోల్ గేట్ దగ్గర ఆగి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండా, ముందే చెల్లించి ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. ఈ పాస్ ద్వారా రోజూ ప్రయాణించేవారు భారీగా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ పాస్ డైలీ లేదా వారానికి 4-5 సార్లు ఒకే మార్గంలో ప్రయాణించే వారికీ బాగా సరిపోతుంది. ఉద్యోగం లేదా బిజినెస్ పని మీద టోల్ గేట్లును తరచూ దాటే వారికీ ఉపయోగపడుతుంది. ఎక్కువుగా రవాణా వ్యాపారులకి ఇది ఉపయోగపడుతుంది.

ఈ వార్షిక పాస్ తో ప్రయోజనాలు ఒక్కటే కాదు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఈ పాస్ కొన్ని టోల్ గేట్లకే పరిమితమవుతుంది. మీరు ప్రయాణించే మార్గంలో ఈ పాస్ వర్తిస్తుందో లేదో ముందుగా తెలుసుకోవాలి. ఇది కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతిని ఇస్తుంది. ఈ పాస్‌ను ఒక వాహనానికి మాత్రమే జతచేస్తారు. వేరే వాహనానికి బదిలీ చేయలేరు (Non-transferable). రోజుకు కొన్ని ప్రయాణాలకే పరిమితం అయ్యింది. ఎక్కువ ప్రయాణాలు చేస్తే అదనపు చార్జీలు పడే అవకాశం ఉంది. ఈ పాస్ కొనుగోలు చేసిన తర్వాత రీఫండ్ లేదంటే రద్దు చేసుకోవడం సాధ్యం కాదు, కాబట్టి ముందే స్పష్టంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

ఈ వార్షిక పాస్ తీసుకునే ముందు చెక్ చేయాల్సిన విషయాలు:

  • మీ వాహనం ఈ పాస్‌ ప్రొవైడ్ చేసే వాహణాలలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
  • మీ ప్రయాణ మార్గంలో ఉన్న టోల్ గేట్లులో ఈ పాస్‌ను అంగీకరిస్తున్నారా లేదా అనేది అవసరమైతే, సంబంధిత టోల్ ఆపరేటర్లతో సంప్రదించి స్పష్టత పొందండి.రిటైర్మెంట్ తర్వాత మీరు ఇంట్లో కూర్చుని నెలకు రూ.70 వేలు సంపాదించవచ్చు..ఎలాగో తెలుసుకోండి

రిటైర్మెంట్ తర్వాత మీరు ఇంట్లో కూర్చుని నెలకు రూ.70 వేలు సంపాదించవచ్చు..ఎలాగో తెలుసుకోండి

  • ఈ పాస్‌ను మీరు ఒక్క రూట్‌కి మాత్రమే ఉపయోగించగలరు. ఉదా: మీ హోం టౌన్ నుండి సిటీ వరకు. మీరు వేరే రూట్‌లో ప్రయాణిస్తే ఇది పని చేయదు.
  • కొన్ని పాస్‌లు రోజుకు కేవలం రెండు ప్రయాణాల వరకే పరిమితం అయ్యే అవకాశముంది.
  • ఈ పాస్ పొందేందుకు ఆన్‌లైన్‌ అప్లికేషన్ ప్రక్రియ ఉంటుంది. అలాగే, అనుమతి వచ్చేందుకు కొంత సమయం పట్టొచ్చు.
  • వార్షిక పాస్‌లు ఎక్కువగా నిర్దిష్ట మార్గాలపై తరచూ ప్రయాణించే వాహనదారులకు మాత్రమే ఉపయోగపడతాయి. సాధారణంగా నెలకు 2-3 సార్లు ప్రయాణించే వారు ఈ పాస్ తీసుకోవడం వల్ల పెద్దగా లాభం ఉండదు.

FASTag Annual Pass కొన్ని ప్రయాణికులకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ, అందరికీ కాదు. మీరు వాస్తవంగా ఈ పాస్ ద్వారా లాభపడతారా? లేదా మీరు అంతగా టోల్ గేట్లును దాటక పోతే దాని తీసుకునే ముందు అన్ని పరిమితులు, నిబంధనలు పూర్తిగా చదివి, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రయాణ అలవాట్ల ఆధారంగా సరైన ఎంపిక చేసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+