రిటైర్మెంట్ తర్వాత మీరు ఇంట్లో కూర్చుని నెలకు రూ.70 వేలు సంపాదించవచ్చు..ఎలాగో తెలుసుకోండి

నా వయస్సు 46 సంవత్సరాలు, నేను ఇప్పటివరకు 24 సంవత్సరాల పని అనుభవాన్ని సంపాదించాను. ఇటీవల నేను ఉద్యోగం వదిలేశాను. నా నెలవారీ ఖర్చులకు రూ.70,000 అవసరమవుతోంది. ఈ మొత్తాన్ని Systematic Withdrawal Plan (SWP) ద్వారా పొందాలనుకుంటే, ఎంత కార్పస్ (మొత్తం పెట్టుబడి) అవసరం అవుతుంది, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను నిధులను ఎలా కేటాయించాలి? ఈ పరిస్థితి ఎవరికైనా తలెత్తవచ్చు. దీన్ని మెల్లగా అధిగమించేందుకు, జాగ్రత్తగా పెట్టుబడి ప్లాన్ చేసి, జీవితాన్ని స్థిరంగా, విజయవంతంగా చేసుకోవడానికి మీరు ఈ ఆలోచనను అనుసరించవచ్చు.

మీ వయస్సు, అనుభవం, ప్రస్తుతం ఉద్యోగం లేకుండా ఉండటం వంటి పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే, నెలకు ₹70,000 స్థిర ఆదాయం పొందాలన్న లక్ష్యం కోసం సరైన పెట్టుబడి వ్యూహం అవసరం అవుతుంది. ఈ తరహా అవసరాలకు సిస్టమాటిక్ విత్ డ్రా ప్లాన్ (SWP) ఒక స్థిరమైన పరిష్కారంగా నిలవగలదు. SWP ద్వారా పెట్టుబడి చేసిన మొత్తం నుండి ప్రతి నెల మీరు అవసరమైన డబ్బు తీసుకోవచ్చు. మీరు నెలకు రూ.70,000 తీసుకుంటూ సరి పెట్టాలనుకుంటే, రూ.9 లక్షలు పెట్టుబడి చేసి, దానిని నెలలవారీగా విత్‌డ్రా చేస్తూ, సుమారు ఒక సంవత్సరం మీరు జీవించవచ్చు.

Systematic Withdrawal Plan SWP for monthly income Investments Investment after retirement Investment Planning SWP benefits Corpus for SWP Monthly income from investment Retirement planning India Mutual funds income plan Safe investment after quitting job SWP for regular income SWP investment strategy Passive income planning SWP SWP

మీరు ఒక సంవత్సరం పాటు మాత్రమే ఈ ఆదాయం కావాలంటే:
మీరు మళ్లీ ఒక సంవత్సరం లోపల ఉద్యోగంలో చేరతారని భావిస్తే, కార్పస్(మొత్తం పెట్టుబడి) పూర్తిగా దెబ్బతినకుండా నెలకు రూ.70,000 (అంటే సంవత్సరం మొత్తానికి రూ.8.4 లక్షలు) పొందాలంటే, దాదాపు రూ.1.2 కోట్లు అవసరం అవుతుంది. ఇది 7% వడ్డీ వచ్చే డెబ్ట్ ఫండ్లు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆధారంగా లెక్కించబడినది. ఈ లెక్కలో మేము ద్రవ్యపీలిక (inflation)ను పరిగణలోకి తీసుకోలేదు.

ఇకపై ఉద్యోగం చేయకపోతే:
మీరు ఇకపై ఉద్యోగం చేయకూడదనుకుంటే, మరియు మీ జీవిత కాలం 80 ఏళ్లు అని ఊహిస్తే (మరల 34 సంవత్సరాల జీవన అవసరం). పెట్టుబడి రాబడిని 7.5% గా పరిగణనలోకి తీసుకుంటే, మీకు దాదాపు రూ.1.8 కోట్లు అవసరం అవుతుంది. ఈ మొత్తం పెట్టుబడి మీకు ప్రతి నెలా రూ.70,000 ఆదాయాన్ని అందించగలదు, దీనిలో ద్రవ్యపీలికను సంవత్సరానికి 4.5% గా తీసుకున్నాం.

సిస్టమాటిక్ విత్ డ్రా ప్లాన్ అంటే ఏమిటి?
SWP అనేది మ్యూచువల్ ఫండ్‌లోని ఓ విధానం. దీనివల్ల మీరు మీ పెట్టుబడుల నుండి ప్రతి నెల లేదా నిర్దిష్ట వ్యవధి తరహాలో ఒక స్థిరమైన మొత్తం డబ్బును తీసుకునే విధానము. ఉదాహరణకు: మీరు బ్యాంక్‌లో డబ్బు జమ చేస్తే వడ్డీ వస్తుంది కదా... అలాగే మ్యూచువల్ ఫండ్‌లో డబ్బు పెడితే, మీకు అవసరమైనంత డబ్బుని నెలకి నెలకి వెనక్కి తీసుకోవచ్చు. అదే SWP.

SWP ఎవరికీ బాగా ఉపయోగపడుతుంది:
ఇది ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వాళ్లకి, నెలవారీ ఖర్చులు ఉండే ఫిక్స్డ్ ఆదాయం అవసరమైనవాళ్లకి, పెద్ద మొత్తం పెట్టుబడి చేసి, దాన్ని కాస్త కాస్త నెల నెల తీసుకుంటూ ప్రయోజనం పొందాలనుకునేవాళ్లకి, ఉద్యోగం మానేసి కొత్త పని వెతుకుతున్నవాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది.

SWP పెట్టుబడి పెట్టడం వల్ల ప్రతి నెల నిలకడైన నెలవారీ ఆదాయం లభిస్తుంది. ఫిక్సెడ్ డెపోసిట్(FD) కంటే కొంత తక్కువ ట్యాక్స్ పడుతుంది. అత్యవసర పరిస్థితులలో కావాలంటే డబ్బు తీసుకునే అవకాశం ఉంది. మీరు తీసుకునేంతవరకూ మిగిలిన డబ్బు మీ మూలధనం పెరుగుతూనే ఉంటుంది. ఖర్చు కోసం సేవింగ్స్ తీయడం కన్నా ఇది క్రమబద్ధమైన, క్రమశిక్షణ అందించే విధానం.

ఇది మార్కెట్ మీద ఆధారపడే పెట్టుబడి కాబట్టి, వడ్డీ స్థిరంగా ఉండదు. ఎటువంటి ఫండ్‌లో పెట్టాలో, ఎంత తీసుకోవాలో ముందుగానే ప్లాన్ చేయాలి. ఎక్కువ మొత్తంలో ప్రతి నెల తీసుకుంటే, రిటర్న్స్ కాకుండా మీ మిగిలిన డబ్బునే తీయాల్సి వస్తుంది. మీరు ఒకవేళ బయటకి తీయాలి అనుకున్న డబ్బు మీద tax కూడా వర్తిస్తుంది.

ఇక్కడ మీకు సరైన SWP ప్లాన్ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడి ముందు మీ అవసరాలను, వయస్సును, రాబడి అంచనాలను బాగా విశ్లేషించుకోవాలి. ఒక నిపుణుడి సలహాతోనే పెట్టుబడి తీసుకోవడం మంచిది. సరైన ప్లానింగ్‌తో SWP ద్వారా నెలకు నెలకూ ఆదాయాన్ని పొందుతూ, మీ ప్రధాన మూలధనాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఖర్చులు నియంత్రణలో ఉండేలా చూసుకుంటే, ఇది ఒక స్థిరమైన ఆదాయ మార్గంగా నిలుస్తుంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+