రైతులకు మొన్నటి దాకా పెరుగుతున్న ఖర్చులు ఒక పెద్ద సవాల్ లాగా మారింది. కానీ ఇప్పుడు GST కొత్త రిఫార్మ్స్ వల్ల సౌలభ్యం! కౌన్సిల్ ఇటీవల పన్ను రేట్లలో పెద్ద మార్పులు ప్రకటించింది. 12% మరియు 28% రేట్లు తొలగించి, 5%, 18%, 40% మాత్రమే మిగిలాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చెందిన ఎక్కువ ఉత్పత్తులు ఇప్పుడు 5% GST రేట్లోకి వచ్చాయి.

రైతులు తరచుగా తక్కువ పన్నుల కోసం డిమాండ్ చేసేవారు, ఇప్పుడు అది నిజమవుతోంది. కెమికల్ పెస్టిసైడ్స్ మాత్రం 18% GSTతో కొనసాగుతున్నాయి, కానీ బయో పెస్టిసైడ్స్, ఎరువులు, ముఖ్యమైన రా మెటీరియల్స్ అన్నీ 5%కి తగ్గాయి. దీని వల్ల రైతుల ఖర్చు తక్కువవుతుంది.
ట్రాక్టర్లు చవకగా:
రైతులకి ట్రాక్టర్ అనేది "సుపర్ హీరో" లాంటిది. 1800 cc కంటే తక్కువ ఇంజిన్ ఉన్న ట్రాక్టర్లు ఇప్పుడు 5% GSTలో లభిస్తాయి, ఇంతకుముందు 18% ఉండేది. టైర్లు, హైడ్రాలిక్ పంపులు, ఇతర యాక్సెసరీస్ కూడా చవకవుతాయి. చిన్న రైతులు ట్రాక్టర్ కోసం ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు.
నీటి సరఫరాకు ప్రోత్సాహం:
డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలు, హార్వెస్టింగ్ యంత్రాలు అన్నీ 5% GSTలోకి వచ్చాయి. దీని వల్ల రైతులు అధిక ధర కడితే, అదే ఖర్చులో ఎక్కువ సామర్థ్యం పొందగలుగుతారు. నీటినిర్వహణ కూడా సులభమవుతుంది.
ఎరువులు, పండ్లు, ఫుడ్ ప్రాసెసింగ్:
అమోనియా, సల్ఫ్యూరిక్, నైట్రిక్ ఆసిడ్ అన్నీ 5% GSTలోకి మార్చబడ్డాయి. పండ్లు, కూరగాయల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ 5% GSTలోకి వచ్చాయి. దీని వల్ల ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, చిన్న పరిశ్రమలకు ఆదాయం పెరుగుతుంది. పాల, మిల్క్ ప్రొడక్ట్స్ 12% నుండి 5% GSTకి తగ్గాయి. ప్రాసెస్డ్ ఫిష్, సహజ తేనె అన్నీ 5% GST! దీని వల్ల గ్రామీణ, ట్రైబల్ కమ్యూనిటీస్ లాభపడతాయి, పోషకాహారం సులభం అవుతుంది.
సోలా ఎనర్జీ & వాణిజ్య వాహనాలు:
సోలా పరికరాలు 5% GSTకి, ట్రక్కులు మరియు డెలివరీ వాహనాలు 18% GSTకి చేరాయి. వీటి ఇన్సూరెన్స్ రేట్లు కూడా తగ్గాయి. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడం ఇప్పుడు తక్కువ ఖర్చుతో వేగవంతం అవుతుంది.
తక్కువ పన్నుల వల్ల రైతుల ఖర్చులు స్వల్పమవుతాయి, అంటే ఒకేసారి ఉత్పత్తి కోసం ఎక్కువ డబ్బు కట్టాల్సిన అవసరం ఉండదు. దీని ఫలితంగా, రైతులు తమ మొత్తం సంవత్సరపు ఆదాయం సులభంగా పెంచుకోవచ్చు. తక్కువ ఖర్చులో ఎక్కువ ఉత్పత్తి చేసి, మార్కెట్‌కి సరఫరా చేయడం వల్ల వార్షిక లాభం పెరుగుతుంది.
ట్రక్కులు, డెలివరీ వాహనాలపై GST తగ్గింపు మరియు ఇన్సూరెన్స్ రేట్ల తగ్గింపు వల్ల రైతులకు రవాణా సౌకర్యం తక్కువైది. పంటలు, పండ్లు, డైరీ ఉత్పత్తులు ఇప్పుడు తక్కువ ఖర్చుతో, వేగంగా మార్కెట్‌కి చేరతాయి. దీని వల్ల రైతులు సమయాన్ని, డబ్బును ఆదా చేసుకుంటూ, మరిన్ని లాభాలు పొందగలుగుతారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications