Farmers: రైతులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే పూచీకత్తు లేకుండా రూ.5 లక్షల రుణం..
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పూచీకత్తు లేకుండా రూ.5 లక్షల వరకు రైతులు రుణం తీసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు అన్నదాతలకు కిసాన్ క్రెడిట్ కార్డు(KCC) ద్వారా అందిస్తున్న లోన్ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.3 లక్షలుగా రుణ పరిమితి ఉండేది. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.
వ్యవసాయ ఖర్చులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంచినట్లు తెలుస్తోంది. కూలీల ఖర్చులు పెరగడం, ఎరువుల ఖర్చులు గత కొన్నేళ్లల్లో భారీగా పెరుగుతూ వస్తున్నాయి. కిసాన్ క్రెడిడ్ కార్డు పరిమితి పెంచాలని రైతులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రుణ పరిమితిని కూడా కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక నుంచి రైతులు ఎలాంటి పూచీకత్తు పెట్టకుండా బ్యాంకుల నుంచి రూ.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. లోన్ ఏడాదిలోగా చెల్లిస్తే కేంద్రం వడ్డీపై రాయితీ సౌకర్యం కల్పిస్తోందని గుర్తు చేస్తున్నారు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు తీసుకుంటే.. ఆ రణాలకు వడ్డీ తక్కువగా ఉంటుంది. సాధారణంగా అన్నదాతలు పంట పెట్టుబడి కోసం బయట అప్పులు చేస్తారు. దీంతో వారు ఎక్కువ వడ్డీ చెల్లించి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడే వారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకొచ్చింది. ఈ కార్డు ద్వారా బ్యాంకులకు వెళ్లి ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు తీసుకోవచ్చు.

అయితే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు పొందాలంటే.. పట్టాదారు పాసు పుస్తకాలు అవసరం ఉంటుంది. వాటికి సంబంధించిన జిరాక్స్‌లు అందించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకుల్లో అందుబాటులో ఉండే కేసీసీ దరఖాస్తులు నింపి సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ డబ్బులను పంట పెట్టుబడి కోసం ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. అయితే కేవలం పంట పోలాలకే కాకుండా పాడి పరిశ్రమ, పశుపోషణ, చేపలు, రొయ్యల పెంపకం, మేకలు, పందుల పెంపకం వంటి వారికి కూడా రుణాలు అందిస్తున్నారు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలకు ఏడాదికి 7 శాతం వడ్డీ ఉంటుంది. రైతులు సకాలంలో చెల్లిస్తే కేంద్రం 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది.
అంటే రైతులు కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం జరిగితే ఆర్బీఐ నిబంధల ప్రకారం రుణ గడువును 5 ఏళ్లకు పెంచే సౌకర్యం కూడా ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు పెంచారు.. కానీ పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలు పెంచడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. 2019 నుంచి రూ.6 వేలే ఇస్తున్నారని.. వీటిని రూ.12 వేలకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications