PM KUSUM: రూ.1 .5 లక్షల సోలార్ మోటర్‌ను రూ.60 వేలకే సొంతం చేసుకోండి..!
కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అనేక పథకాలు తీసుకొచ్చింది. పీఎం కిసాన్, తక్కవ వడ్డీకే రుణాలు, సబ్సిడీపై ఎరువులు, అలాగే సబ్సిడీపై సోలార్ పంపు సెట్లు కూడా అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో సౌరశక్తి ఆధారిత పంపు సెట్లు అందిస్తున్నారు. విద్యుత్ కోతల నేపథ్యంలో సోలార్ పంపు సెట్లు ఉపయోగం ఉంటుంది. సోలార్ పంపు సెట్ల వాడకం వల్ల విద్యుత్ తో అవసరం ఉండదు. అందుకే సబ్సిడీపై సోలార్ పంపు సెట్లు అందిస్తోంది.
ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం కింద సోలార్ పంపుల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భారీగా ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా రైతులకు సాధారణంగా 60 శాతం వరకు సబ్సిడీ చెల్లిస్తుంది. అంతేకాకుండా 30 శాతం వరకు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అన్నదాతలు 10 శాతం సొమ్ము చెల్లిస్తే సోలాప్ పంపు సెట్లను ఇంటికి తీసుకెళ్లొచ్చు. తీసుకున్న బ్యాంకు రుణాలు నెలనెలా తిరిగి చెల్లించవచ్చు.

కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక నిబంధనల ప్రకారం చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నారు. హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సోలార్ పంపులపై ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మరింత ఎక్కువ ఆర్థిక సహాయాన్ని చేస్తోంది. అయితే ఇక్కడ సోలార్ పంపు సెట్ల ధరలు భారీగానే ఉన్నాయి. సోలార్ పంపు సెట్లు ధరలు సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. 3 హెచ్పీ సోలార్ పంప్ సెట్ ధర దాదాపు రూ.1,50,000 నుంచి రూ.1,80,000 వరకు ఉంటుంది. దీనిపై ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ అందిస్తుంది.
అంటే రూ.1,50, 000 గల సోలార్ పంపు సబ్సిడీ పోను.. రూ.60 వేల వరకు రైతు చెల్లించాల్సి ఉంటుంది. 5 హెచ్‌పీ సోలార్ పంపు అసలు ధర రూ.3 లక్షలకు పైగా ఉండవచ్చు. సబ్సిడీ పొందిన తర్వాత రైతులపై పడే భారం దాదాపు రూ.1,20,000 వేల వరకు ఉంటుంది. PM-KUSUM పథకం ప్రయోజనం పొందేందుకు రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం స్థానిక ఏఈఓ లేదా ఏఓను సంప్రదించవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications