బంగారం కొనుగోలులో, బంగారు ఆభరణాల వినియోగంలో భారతదేశం ముందు వరుసలో ఉంటుంది. అటువంటి భారతదేశంలోనూ 2020లో బంగారం డిమాండ్ 35 శాతం క్షీణించి 25 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది అంటే అందుకు కారణాలు సవాలక్ష. ఇక ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్ బాగా తెగ్గింది.

కరోనా కారణంగా ప్రజల ఆర్ధిక స్థితి అల్లకల్లోలం .. బంగారం కొనుగోలుపై అనాసక్తి
2020లో ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితమైన దేశాలలో భారతదేశం కూడా ముందు వరుసలో ఉంది. భారతదేశంలో కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. సంపన్నుల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక కష్టాలలో కూరుకుపోయారు. కరోనా కారణంగా ఎన్నో నష్టాలను చవి చూశారు. ఇక ఇలాంటి సమయంలో ఊహించని విధంగా బంగారం ధరలు పెరుగుదల కూడా బంగారం పై ఒక రకంగా విముఖతను పెంచాయి.

సామాన్య మధ్యతరగతి ప్రజలు తాము కొనుగోలు చెయ్యలేనంతగా పెరుగిన ధరలు
గతంలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధరలు పెరగడం సామాన్య, మధ్యతరగతి ప్రజలు తాము కొనుగోలు చెయ్యలేము అనే భావనకు వచ్చేలా చేశాయి. బంగారానికి బదులుగా ఇమిటేషన్ జ్యువలరీని కొనుగోలు చేసి వాటితోనే నడిపించేస్తున్నారు. సామాన్యుడు కొనలేని ధరాఘాతం నేపథ్యంలో కొంత బంగారంపై విముఖత పెరగగా, కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రోజువారీ ఖర్చులు, సాధారణ జీవితమే కష్టంగా కొనసాగుతోంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో బంగారం పైన ఎవరూ ఆసక్తి చూపించడం లేదు అనేది నిర్వివాదాంశం.

బంగారంపై మక్కువ చూపకపోవటానికి కారణాలివే
అందుకే గతంలో లేనివిధంగా బంగారం డిమాండ్ భారత్లో విపరీతంగా తగ్గింది. అందుకు కరోనా ప్రధాన కారణం కాగా అధిక ధరలు డిమాండ్ ను అనూహ్యంగా తగ్గించేశాయి .ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి అదేస్థాయిలో డిమాండ్ పడిపోయింది. బంగారంపై ఎవరూ పెద్దగా మక్కువ చూపుతున్న దాఖలాలు కనిపించటంలేదు. కరోనా నుండి,ఆర్థిక సంక్షోభం నుండి బయట పడితే మళ్లీ పరిస్థితులు సాధారణంగా మారుతాయని, ప్రజలు బంగారం కొనుగోలు ఎక్కువ ఆసక్తి చూపుతారని జువెలరీ షాప్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications