కరోన అంతరాయాల నుండి ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుండటంతో డిమాండ్ పుంజుకొని, ఉత్పత్తి పెరుగుతోంది. దీంతో అక్టోబర్ నెలలో ఉత్పత్తి కార్యకలాపాలు వేగంగా విస్తరించి PMI (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) ఆశాజనకంగా నమోదయింది. అయితే పలు సంస్థలు ఉద్యోగులను తొలగించినట్లు ఓ ప్రయివేటు సర్వే నివేదిక వెల్లడిస్తోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ వృద్ధి రేటు 23.9 శాతం క్షీణించింది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి వృద్ధి ప్రతికూలత నమోదు చేసింది.

పీఎంఐ జంప్.. దశాబ్దకాలంలో గరిష్టం
IHS మార్కిట్ ప్రకారం పీఎంఐ సెప్టెంబర్ నెలలో 56.8 కాగా, అక్టోబర్ నెలలో 58.9గా నమోదయింది. మే 2010 నుండి ఇదే అత్యధికం కావడం గమనార్హం. దశాబ్ద కాలంలో ఇదే గరిష్టం. అంతేకాకుండా భారీ పతనం అనంతరం వరుసగా మూడు నెలల పాటు 50 స్థాయి దాటడం గమనార్హం. భారత ఉత్పత్తిదారులకు కొత్త ఆర్డర్స్ పెరుగుతున్నాయని, దీంతో ఉత్పత్తి పెరుగుతోందని, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో చూసిన కరోనా సంకోచం నుండి కోలుకుంటున్నట్లు IHS మార్కిట్ ఎకనమిక్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డి లిమా అన్నారు.

ఆర్థిక పునరుజ్జీవం.. కానీ ఉద్యోగులు పోయాయి
రాబోయే నెలల్లో అమ్మకాల్లో పునరుజ్జీవనం ఉంటుందని కంపెనీలు బలంగా నమ్ముతున్నట్లు తెలిపింది. ఉత్పత్తి, కొత్త ఆర్డర్లు దశాబ్ద కాలంలో భారీగా పెరిగాయని, ఫారెన్ డిమాండ్ 2014 డిసెంబర్ నుండి వేగవంతమైందని చెబుతున్నారు. కానీ పలు సంస్థలు వరుసగా ఏడో నెల ఉద్యోగులను తగ్గించుకున్నట్లు నివేదిక తెలిపింది. 2005లో సర్వే ప్రారంభమైనప్పటి నుండి ఇలా కనిపించలేదని వెల్లడించింది.

ఉద్యోగుల తొలగింతతో...
కంపెనీలు ఉద్యోగులను తొలగించడం వల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం మరింత ఆలస్యం కావొచ్చునని భావిస్తున్నారు. ఇన్‌పుట్, ఔట్ పుట్ ధరలు గత నెలలో వేగంగా పెరిగాయి. ఈ ధరల ప్రభావం ఎక్కువగా కంపెనీలపై పడి, ఒత్తిడికి గురవుతున్నాయి. దీంతో రిటైల్ ద్రవ్యోల్భణం సెప్టెంబర్ నెలలో 8 నెలల గరిష్టం 7.34 శాతానికి పెరిగింది. ఏదేమయినప్పటికీ రానున్న 12 నెలల్లో వ్యాపార ఆశావాదం 2016 ఆగస్ట్ నుండి అత్యధిక స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications