ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీనష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం వరకు అదే క్షీణతను కనబరిచాయి. ఉదయం గం.9.18 సమయానికి ప్రారంభంలోనే 542.32 పాయింట్ల నష్టం చవిచూసిన సెన్సెక్స్, కాసేపటికి 650 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ ఉదయం 158 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ఉంది. మధ్యాహ్నం గం.12.17 సమయానికి సెన్సెక్స్ 445.07 (1.14%) పాయింట్ల నష్టంతో 38,545.87 వద్ద, నిఫ్టీ 122.20 (1.06%) పాయింట్ల నష్టంతో 11,405.25 వద్ద ట్రేడ్ అయింది.

అందుకే ఆటో, ఫార్మా మినహా
స్టాక్ మార్కెట్లు నిన్న స్వల్ప నష్టాల్లో ముగిశాయి. నేడు ప్రారంభంలోనే భారీగా నష్టపోయాయి. ఆగస్ట్ నెలలో వాహనాల విక్రయాలు ఆశాజనకంగా ఉండటంతో ఆటో షేర్లు, ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఈ రెండు మినహా మిగతా అన్ని రంగాల షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. మధ్యాహ్నం సమయానికి నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం మేర నష్టపోయింది. మెటల్, బ్యాంకింగ్ రంగం తీవ్రంగా నష్టపోయింది. డాలర్ మారకంతో రూపాయి రూ.73.05 వద్ద ట్రేడ్ అయింది.

నిమిషంలో రూ.2.12 లక్షల కోట్లు హుష్‌కాకి
శుక్రవారం ఉదయం మార్కెట్లు భారీ నష్టాలను చవిచూడటంతో ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్క నిమిషంలోనే రూ.2.12 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఉదయం గం.9.20 సమయానికే సెన్సెక్స్ 625 పాయింట్లు పడిపోయింది. ఆ సమయంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల సంపద 2.12 లక్షల కోట్లు తగ్గి రూ.154.85 లక్షల కోట్లకు పరిమితమైంది. ఆ తర్వాత సెన్సెక్స్ 652 పాయింట్లు పడిపోయినప్పుడు మరింతగా నష్టపోయింది. ఆయితే ఆ తర్వాత దాదాపు 200 పాయింట్లు కోలుకుంది.

మార్కెట్ నష్టాలకు కారణాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు కరోనా కేసులు తగ్గడం లేదు. నిన్న అమెరికా నాస్‌దాక్ 5 శాతం, డౌజోన్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇతర అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టపోయాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లు, ఆసియా మార్కెట్లపై పడింది. ఆసియా మార్కెట్లు రెండు వారాల కనిష్టానికి కుంగిపోయాయి. దీంతో భారత మార్కెట్లు నేల చూపులు చూశాయి. దీనికి తోడు చైనాతో సరిహద్దు టెన్షన్ కొనసాగుతోంది. ఇది కూడా మార్కెట్లను దెబ్బతీసింది. దేశంలోను కరోనా కేసులు పెరుగుతున్నాయి. రికవరీ శాతం పెరుగుతున్నప్పటికీ, కరోనా కేసులు నిన్న ప్రపంచ దేశాల్లో మనవద్ద ఎక్కువగా నమోదయ్యాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications