For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ రిటర్న్స్ గడువును పెంచండి: కౌన్సిల్‌కు ICAI విజ్ఞప్తి

|

2018-19 జీఎస్టీ వార్షిక రిటర్న్ ఫైలింగ్ తేదీని పొడిగించాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) కోరింది. ఈ మేరకు 3 నెలల పాటు గడువును పొడిగించాలని జీఎస్టీ కౌన్సిల్‌కు లేఖ రాసింది. FY19 జీఎస్టీ ట్యాక్స్ పైలింగ్‌కు చివరి తేదీ సెప్టెంబర్ 30. అయితే దీనిని డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కోరుతోంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతోన్న విషయం తెలిసిందే. మూడు నెలల పాటు గడువు ఇవ్వడం వల్ల కరోనా పరిస్థితులపై పోరాడేందుకు కొంత సమయం చిక్కుతుందని అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే మూడు నెలల పాటు పొడిగించి సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పించింది.

COVID-19 Insurance: ఆ ఉద్యోగులకు SBI గుడ్‌న్యూస్COVID-19 Insurance: ఆ ఉద్యోగులకు SBI గుడ్‌న్యూస్

Extend FY19 GST annual return filing deadline by 3 months

జీఎస్టీ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్‌కు కాస్త వెసులుబాటు కల్పించాలని, ఇందులో భాగంగా జీఎస్టీ యాన్యువల్ రిటర్న్, జీఎస్టీ ఆడిట్ 2018-19 ఫైలింగ్ గడువును మూడు నెలల పాటు పొడిగించి, డిసెంబర్ 31వ తేదీ వరకు వెసులుబాటు కల్పించాలని కోరామని ICAI తెలిపింది.

English summary

జీఎస్టీ రిటర్న్స్ గడువును పెంచండి: కౌన్సిల్‌కు ICAI విజ్ఞప్తి | Extend FY19 GST annual return filing deadline by 3 months

The Institute of Chartered Accountants of India (ICAI) has written to the GST Council asking for an extension of 2018-19 GST annual return filing deadline. ICAI has sought a deferment by 3 months till December 31. As of now, the last date for filing annual returns for FY19 for Goods and Services Tax (GST) registered taxpayer is September 30. ICAI said that the majority of the offices are working only partially due to the coronavirus pandemic.
Story first published: Monday, September 14, 2020, 11:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X