Exports Fall: మందగించిన ఆర్థికం.. తగ్గిన భారత ఎగుమతులు.. పెరిగిన వాణిజ్య లోటు..
Exports Fall: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికం రోజురోజుకూ మందగిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రభావం భారతదేశంపై కూడా పడింది. ఏడిది క్రితంతో పోల్చితే అక్టోబర్‌లో భారత ఎగుమతులు 16.65% క్షీణించాయి. గత 20 నెలల్లో మెుదటిసారిగా ఎగుమతులు 30 బిలియన్ డాలర్ల కిందకు చేరుకున్నాయి.

పెరిగిన దిగుమతులు..
ఇదే సమయంలో భారత దిగుమతులు మాత్రం ఏడాదికి 5.7% వృద్ధి చెంది 56.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య లోటు 50.25% పెరిగి 26.91 బిలియన్ డాలర్లకు చేరుకుందని మంగళవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అక్టోబర్ లోటు సెప్టెంబర్ 2022 కంటే దాదాపు 4.7% ఎక్కువగా ఉంది.

ఇంజనీరింగ్ వస్తువులు..
ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశ ఎగుమతుల్లో ప్రధానమైన ఇంజినీరింగ్ వస్తువులు 21% పైగా పడిపోయి 7.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐరన్ అండ్ స్టీల్ పై ఎగుమతి పన్ను ఎక్స్ పోర్ట్స్ ను దెబ్బతీసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. రెడిమేడ్ గార్మెంట్స్, వ్యాల్యుబుల్ స్టోన్స్ అండ్ ఆభరణాలు వంటి ప్రధాన రంగాల నుంచి ఎగుమతులు 21% పైగా పడిపోయాయి. అయితే పత్తి నూలు, చేనేత, హస్తకళ ఉత్పత్తులు ఏడాది క్రితం కంటే దాదాపు సగానికి పడిపోయాయి.

పండుగలు..
దీపావళి, దసరా పండుగల కారణంగా ఫ్యాక్టరీ కార్మికులు సెలవుపై వెళ్లారు. దీనివల్ల ఉత్పత్తి అక్టోబర్‌లో చాలా రంగాల్లో ఉత్పత్తి తగ్గినట్లు వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్‌వాల్ తెలిపారు. గతంలో రెండేళ్ల కాలాన్ని చూస్తే.. దీపావళి-దసరా మధ్య కాలంలో ట్రేడ్ గ్యాప్ 4 బిలియన్ డాలర్లుగా ఉందని ఆయన తెలిపారు. ఈ కారణంగా ఎగుమతులు తగ్గగా దిగుమతులకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. నవంబర్‌లో వచ్చే డేటా ఆధారంగా ధోరణి ఎలా ఉంటుందో తాము అంచనా వేస్తామని అన్నారు. WTO ప్రకారం 2023లో ప్రపంచ వాణిజ్యం కేవలం 1% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.

డిమాండ్ మందగింపు..
ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మందగించడం వల్ల వచ్చే నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బాధాకరంగా మారనుంది. తరువాతి త్రైమాసికాల్లో వాణిజ్య లోటు పెరగటం వల్ల భారత జీడీపీలో గణనీయమైన భాగం క్షీణిస్తుందని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా హెచ్చరించారు. ప్రధాన ఎగుమతుల్లో 17 శాతం క్షీణత ఆందోళనను కలిగిస్తోందని అన్నారు.


Click it and Unblock the Notifications