Tata Motors: టాటా మోటర్స్ షేర్లను ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా..!
టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ SEBI వద్ద DRHP (డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్) దాఖలు చేసిన తర్వాత టాటా మోటార్స్ షేర్లు పెరుగుతూ వస్తున్నాయి. IT కంపెనీ Tata Technologies IPO కోసం DRHP ఫైల్ చేసి సరిగ్గా మూడు నెలలైంది. ఈ మూడు నెలల్లో, Tata Motors షేర్ ధర ఒక్కో షేరుకు రూ.430 నుంచి రూ.562 కు చేరింది. దాదాపు 30 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేసింది. టాటా టెక్నాలజీస్ IPO వచ్చే వరకు టాటా మోటార్స్ షేర్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
టాటా టెక్నాలజీస్ IPO ద్వారా వచ్చే నిధులతో టాటా మోటార్స్ బ్యాలెన్స్ బలోపేతం అయ్యే అవకాశం ఉందని ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ చెప్పారు. టాటా గ్రూప్ చాలా కాలంగా నిర్మించుకున్న బలమైన బ్రాండ్ ఇమేజ్ ఉన్నందున టాటా టెక్నాలజీస్ IPOలో ప్రైమరీ, సెకండరీ మార్కెట్ రెండూ బుల్లిష్‌గా కనిపిస్తున్నాయని అవినాష్ తెలిపారు. టాటా టెక్నాలజీస్ IPO ప్రారంభించిన తర్వాత మార్కెట్ బలమైన త్రైమాసిక సంఖ్యలను ఆశిస్తున్నందున టాటా మోటార్స్ షేర్లలో అప్‌ట్రెండ్ కొనసాగవచ్చని ఆయన అన్నారు.

టాటా టెక్నాలజీస్ తన IPO కోసం 9 మార్చి 2023న SEBIకి DRHPని దాఖలు చేసింది. 9.571 కోట్ల షేర్లను విక్రయించడానికి, దాని పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో దాదాపు 23.6%ని ఆఫర్ ఫర్ సెల్ ద్వారా విక్రయించనుంది. టాటా టెక్నాలజీలో టాటా మోటార్స్ కు 74.69% వాటా ఉంది. ఆల్ఫా TC హోల్డింగ్స్ Pte, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్-I వరుసగా 7.26%, 3.63% వాటాలను కలిగి ఉన్నాయి.
టాటా టెక్నాలజీస్ ఐపీఓ ఎప్పుడు తీసుకొస్తారో ఇంకా ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే చాలా రోజుల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓ రావడంతో పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. టాటా గ్రూప్ నుంచి చివరగా టీసీఎస్ ఐపీఓ వచ్చింది.
Note:ఇది వార్త కేవలం నిపుణుల అభిప్రాయం మాత్రమే. దీనికి గుడ్ రిటర్న్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.


Click it and Unblock the Notifications