హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్ సెంటర్, నాలుగేళ్లలో 2,300 ఉద్యోగాలు
హైదరాబాద్: డేటా విశ్లేషణ, ఆర్థిక సేవల సంస్థ ఎక్స్‌పీరియన్ హైదరాబాద్‌లో తన ఇండియా డెవలప్‍మెంట్ కేంద్రాన్ని (IDC) మంగళవారం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌పీరియన్స్ ప్రోడక్ట్ బృందాలకు ఈ డేటా సెంటర్ సహకారం అందిస్తుంది. టెక్నాలజీ, అనలటిక్స్, ఇన్నోవేషన్ తదితర అంశాలలో ఇది పని చేస్తుంది. దీనిని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు.

నాలుగేళ్లలో 2300 ఉద్యోగాలు
ఇండియాలో ఎక్స్‌పీరియన్ విస్తరణకు హైదరాబాద్ డేటా సెంటర్ దోహదపడుతుందని గ్రూప్ ప్రెసిడెంట్ అలెక్స్ లింట్నెర్ అన్నారు. ప్రస్తుతం ఈ IDCలో 200 మంది ఇంజినీర్లు పని చేస్తున్నారని, రానున్న నాలుగేళ్లలో.. అంటే 2024 నాటికి వీరి సంఖ్య 2,500కు చేరుకుంటుందని ఎక్స్‌పీరియన్ ఇండియా చీఫ్, ఎండీ సత్య కల్యాణ సుందరం అన్నారు. అంటే ఈ నాలుగేళ్లలో ఇక్కడ 2300 ఉద్యోగాలు వస్తాయన్నారు.

అందుకే హైదరాబాద్.
ఐటీ కంపెనీలను, నిపుణులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న హైదరాబాద్ పరిశోధన కేంద్రంగా మారిందని, దీంతో ఇక్కడే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయని అలెక్స్ లింట్నెర్ తెలిపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, అత్యుత్తమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలులో IDCకి హైదరాబాద్ ఆదర్శమన్నారు.

హైటెక్ సిటీలో ఈ డేటా సెంటర్
కాగా, ఈ డేటా సెంటర్ హైటెక్ సిటీలో ప్రారంభించారు. 35,000 స్క్వేర్ ఫీట్లతో ఏర్పాటు చేశారు. ఇందులో 24×7 కేఫ్‌టెరియా, ఫిట్‌నెస్సెంటర్ వంటివి ఉద్యోగుల కోసం అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications