Telangana: భారీగా తగ్గిన సన్న వడ్ల ధరలు.. బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు..!

రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు భారీగా పెరిగాయి. మంచి రకం సన్న బియ్యం కిలో రూ.80 నుంచి రూ.90 పలుకుతున్నాయి. అయితే తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బియ్యం ధరలకు గరిష్ట పరిమితులు విధించింది. BPT, KNM బియ్యం కిలో గరిష్ట ధర రూ.66గా నిర్ణయించగా.. RNR, తెలంగాణ సోనా బియ్యం కిలో రూ.74, HMT, JSR బియ్యం కిలో గరిష్ట ధర రూ.79గా నిర్ణయించింది. కిలో రూ.79 అయినా ఎక్కువగానే ధరలు ఉన్నాయి. బియ్యం ధరలు భారీగా ఉన్న నేపథ్యంలో సన్న వడ్లకు డిమాండ్ వస్తుందని అందరు రైతులు ఆనంద పడ్డారు. మొదట్లో సన్న వడ్లకు మంచి ధరే వచ్చింది. కానీ ఆ తర్వాత వ్యాపారులు సిండికేట్ అయి ధరలు భారీగా తగ్గించారు.

మొన్నటి వరకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలికిన సన్నవడ్లు ఇప్పుడు కొన్నిచోట్ల రూ.2,500కే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వడ్ల రేట్లు పెరిగాయనే సాకుతో సన్నబియ్యాన్ని కిలో రూ.98 దాకా తీసుకెళ్లిన వ్యాపారులు, ఇప్పుడు వడ్ల రేట్లు తగ్గినా బియ్యం ధరలు మాత్రం తగ్గించడం లేదని చెబుతున్నారు. వ్యాపారులు, మిల్లర్ల సిండికేట్ ఉచ్చులో పడి అటు రైతులు, ఇటు వినియోగదారులు నష్టపోతున్నారు. సీజన్ ప్రారంభంలో సన్నవడ్లకు క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.4 వేల నుంచి రూ.5 వేల దాకా రేటు పెట్టడంతో రైతులు ఆనంద పడ్డారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు.

Paddy

మిల్లర్లు, వ్యాపారులు హార్వెస్టర్ యజమానుల ద్వారా ముందే సమాచారం సేకరించి, గ్రామాల్లో ఏజెంట్లను పెట్టి, అడ్వాన్సులు ఇచ్చి మరీ పొలాల దగ్గరే పచ్చి ధాన్యం కొనుగోలు చేశారు. అదే సమయంలో ఎల్‌‌‌‌‌‌‌‌నినోతో ఈసారి వరి దిగుబడి తగ్గుతుందని, సన్నబియ్యం కొరత వస్తుందని భయాందోళనలు రేకెత్తించి, ఉన్న బియ్యాన్ని బ్లాక్ చేసి కిలో రూ.90 నుంచి రూ.98 వరకు పెంచారు. అనుకున్నట్లు బియ్యం రేట్లు పెంచుకున్నాక, ఇప్పుడు సిండికేట్‌‌‌‌‌‌‌‌గా మారి వడ్ల రేట్లు తగ్గిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పలు జిల్లాల్లో సన్నవడ్లను క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.2,900 నుంచి రూ.3,200కే కొనుగోలు చేస్తున్నారు. ఐకేపీ సెంటర్లో సన్న బియ్యం అమ్మితే రూ.2400 వరకు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత రూ.500 బోనస్ ప్రభుత్వం ఇస్తుంది. బోనస్ వస్తుందో రాదో అనే భయంతో రైతులు సన్న వడ్లను రూ.2900 అమ్ముకుంటున్నారు.

బియ్యానికి ముడిసరుకైన వడ్ల రేట్లు తగ్గుతున్నా, సన్నబియ్యం మాత్రం రకాన్ని బట్టి కిలో రూ.90 నుంచి రూ.98కే విక్రయిస్తున్నారు. బియ్యం రేట్లు పెంచి పాత స్టాక్‌‌‌‌‌‌‌‌పైనా అడ్డగోలు లాభాలు గడించిన వ్యాపారులు, మిల్లర్లు ఇప్పుడు రైతుల నుంచి కొనే వడ్ల రేట్లను తగ్గించడం అన్యాయమని వాపోతున్నారు. బియ్యం రేట్లు పెరగడానికి, వడ్ల రేట్లు తగ్గడానికి సిండికేటే కారణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+