ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) ధరలు వేగంగా పడిపోతున్నాయి. అమెరికాలో 2023 చివర్లో వాడిన EVల ధరలు 32 శాతం వరకు తగ్గిపోయాయి. అదే సమయంలో పెట్రోల్ కార్ల ధరలు కేవలం 7 శాతం మాత్రమే తగ్గాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద ధోరణిగా మారింది. ఇక భారతదేశంలో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది.
ఈ పరిస్థితిని బ్లూస్మార్ట్ అనే భారతీయ ఎలక్ట్రిక్ క్యాబ్ సంస్థ ఉదాహరణగా చూపవచ్చు. కంపెనీ ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ వాహనాలను తక్షణమే విక్రయించాల్సి వచ్చింది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే.. ఆ కార్లు ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నప్పటికీ వాటి అసలు ధరలో కేవలం నాలుగో వంతుకే అమ్ముడయ్యాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా EVల విలువ ఎందుకు ఇంత వేగంగా తగ్గుతోందనేపెద్ద ప్రశ్నను లేవనెత్తింది.

దీనికి ప్రధాన కారణం మనం చూసుకున్నట్లయితే.. EV తరుగుదలలో ముఖ్యమైన పాత్ర బ్యాటరీదే. ఎలక్ట్రిక్ కారులో 30 నుంచి 40 శాతం ఖర్చు బ్యాటరీ ప్యాక్‌పైనే ఉంటుంది. పాత మోడళ్లలో బ్యాటరీ క్షీణత ఎక్కువగా ఉండేది. తరచుగా ఛార్జింగ్ చేయడం లేదా ఎక్కువ వేడి పరిస్థితుల్లో వాహనం నడపడం వల్ల బ్యాటరీ పనితీరు తగ్గుతుంది. దానిని మార్చడం ఖరీదైన విషయం. అయితే కొత్త తరం బ్యాటరీలు సంవత్సరానికి కేవలం 1 నుంచి 2 శాతం సామర్థ్యాన్ని మాత్రమే కోల్పోతున్నాయి.
ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. EV బ్యాటరీ స్థితి అంచనా వేయడం కష్టమైన పని. బ్యాటరీ డేటా ఆటోమేకర్ సాఫ్ట్‌వేర్‌లో లాక్ అయి ఉంటుంది, దాన్ని మూడవ పక్షం సులభంగా చూడలేరు. ఫలితంగా, వాడిన EV విలువను సరైన విధంగా అంచనా వేయడం కష్టమవుతోంది.
ఇక EV పరిశ్రమ వేగంగా మారుతోంది. ప్రతి సంవత్సరం మెరుగైన పరిధి, వేగవంతమైన ఛార్జింగ్, కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో కొత్త మోడల్‌లు వస్తున్నాయి. ఉదాహరణకు, 2018లో వచ్చిన EV 150 మైళ్ల పరిధి ఇస్తే.. 2025 మోడల్ 300 మైళ్లకు పైగానే ఇస్తోంది. ఇది పాత మోడళ్లను తక్కువ ఆకర్షణీయంగా చేస్తుంది. అయితే ఇది ప్రతికూల సూచిక కాదని చెప్పుకోవచ్చు. ఇది పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందనే సంకేతాలను అందిస్తోంది. భవిష్యత్తులో సాంకేతికత స్థిరపడిన తర్వాత తరుగుదల రేటు కూడా తగ్గుతుంది.
ఇక మరో అంశంగా ప్రభుత్వ సబ్సిడీలు కూడా తరుగుదల రేటుపై ప్రభావం చూపుతున్నాయి. ఉదాహరణకు చైనాలో కొత్త EVలకు భారీ సబ్సిడీలు అందుతాయి. దీని వల్ల కొత్త కార్లు చౌకగా దొరుకుతాయి. దీంతో పాత EVలు ఆకర్షణ కోల్పోతాయి. అలాగే, చైనీస్ ఆటోమేకర్లు జీరో మైలు వాడిన కార్లు అనే పద్ధతిలో కొత్త కార్లను రిజిస్ట్రేషన్ చేసి వాడినవిగా ఎగుమతి చేస్తున్నారు. ఈ భారీ ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా EV ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
EV విలువ తగ్గుదల వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని తెలుసుకున్న ప్రభుత్వాలు, కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా EU 2027 నుంచి బ్యాటరీ పాస్‌పోర్ట్ అమలు చేయబోతోంది. దీని ద్వారా బ్యాటరీ ఆరోగ్యం రికార్డులు అందుబాటులో ఉంటాయి.ఇక BYD, టాటా వంటి కంపెనీలు బ్యాటరీ వారంటీని 8-15 సంవత్సరాలకు పొడిగిస్తున్నాయి. మరో కంపెనీ నియో (NIO) వంటి సంస్థలు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ మోడల్‌ను ప్రవేశపెట్టాయి. అంటే వాహనం కొనుగోలు చేసి, బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చు.
భారత ప్రభుత్వం కూడా EVల పునఃవిక్రయ విలువను కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది. EVలను 15 సంవత్సరాల స్క్రాపేజ్ రూల్ నుండి మినహాయించాలని ప్రతిపాదిస్తోంది. 2022 బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ నియమాలు ద్వారా రీసైక్లింగ్ బాధ్యతలు స్పష్టంగా పేర్కొన్నాయి.
ఏదేమైనా EV ధరలు పడిపోవడం పరిశ్రమ వైఫల్యం కాదని చెప్పవచ్చు. అది అభివృద్ధి దశలో ఉన్న మార్కెట్ సహజ లక్షణం. సాంకేతిక పురోగతి, బ్యాటరీ డిజైన్ మెరుగుదల, పారదర్శక బ్యాటరీ సమాచారం, దీర్ఘకాలిక వారంటీలు పరిశ్రమను స్థిరపరుస్తాయి. తరుగుదల తాత్కాలికమైనదే అయినప్పటికీ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని చెప్పవచ్చు. తక్కువ నిర్వహణ, పెరుగుతున్న పరిధి, తగ్గుతున్న బ్యాటరీ ఖర్చులు EVల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని మళ్లీ పెంచుతున్నాయి.
More From GoodReturns

Pak Drone: మూడు రోజుల్లో రెండోసారి.. జమ్మూ కాశ్మీర్లో పాక్ డ్రోన్ కలకలం! అసలేం జరుగుతోంది?

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications