3 రోజుల వరుస నష్టాలు..దెబ్బకు కవర్ అయినట్టే: లాభాల్లో స్టాక్స్: ఎల్ఐసీ మాత్రం మరింత
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవ్వాళ లాభాలబాటలో నడిచింది. ఈ వారం తొలి రోజు నుంచి చోటు చేసుకుంటూ వచ్చిన వరుస నష్టాలను అధిగమించింది. మెజారిటీ స్టాక్స్ అన్నీ అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అయ్యాయి. గ్రీన్‌జోన్‌లో కనిపించాయి. సోమ, మంగళ, బుధవారాల్లో నష్టపోయిన పాయింట్లన్నింటినీ ఇవ్వాళ వెనక్కి తెచ్చుకుంది స్టాక్ మార్కెట్. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా చెప్పుకోదగ్గ స్థాయిలో లాభపడ్డాయి.
మూడురోజులుగా వెంటాడుతోన్న తిరోగమనాన్ని ఇవ్వాళ స్టాక్ మార్కెట్ అధిగమించింది. స్టాక్స్ జర్నీ జోష్‌గా సాగింది. అన్ని సెగ్మెంట్స్‌కు సంబంధించిన షేర్లు జోరందుకున్నాయి. ఇదివరకు నష్టపోయిన పాయింట్లన్నింటినీ రీగెయిన్ చేసుకున్నాయి. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్‌ను ప్రకటించిన మరుసటిరోజే మార్కెట్ పాజిటివ్‌గా రియాక్ట్ అయింది.

ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 428 పాయింట్లు లాభపడింది. 55,320. పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ సైతం 122 పాయింట్లు లాభపడింది. 16,478 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించుకుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లు సైతం ఫర్వాలేదనిపించుకున్నాయి.
ఫార్మాసూటికల్స్, మెటల్, స్టీల్, ఆటోమొబైల్స్, ఐటీ, బ్యాంకింగ్.. ఇలా దాదాపు అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అయ్యాయి. ఫార్మా సెగ్మెంట్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నిఫ్టీలో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఈ కంపెనీ షేర్లు మూడుశాతం మేర లాభపడ్డాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈషర్ మోటార్స్, బజాజ్ ఆటో లాభపడ్డ వాటిల్లో ఉన్నాయి.
టాటా స్టీల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆసియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైన్‌సర్వ్, మహీంద్ర అండ్ మహీంద్ర నష్టపోయిన లిస్ట్‌లో ఉన్నాయి. ఆయా కంపెనీల షేర్లన్నీ బుధవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్‌తో పోల్చుకుంటే 2 నుంచి 3 శాతం మేర నష్టపోయాయి.
ఎల్ఐసీ షేర్ల గురించి చెప్పుకోనక్కర్లేని పరిస్థితి ఏర్పడింది. ఇవ్వాళ కూడా ఒక్కో షేర్ మీద రూ.16.45 పైసల నష్టాన్ని మిగిల్చిందీ ఇన్సూరెన్స్ జెయింట్. ఎల్ఐసీ షేర్ల ధరలు నేల చూపులు చూశాయి. ఇటీవలే 800 రూపాయల కంటే దిగువకు ట్రేడింగ్ అయిన ఎల్‌ఐసీ షేర్ల ధరలు.. 700 రూపాయలకు కూడా దిగువగా క్షీణించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఇవ్వాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.721.60 పైసల వద్దకు పడింది. దీని కటాఫ్ ధర 949 రూపాయలు.


Click it and Unblock the Notifications