EPFOలో 20 శాతం పెరిగిన ఖాతాలు, ఫిబ్రవరిలో 12.37 లక్షలు చేరిక

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో ఫిబ్రవరి నెలలో కొత్తగా 12.37 లక్షల మంది చేరారు. 2020 ఇదే ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఇది 20 శాతం అధికం. కరోనా మహమ్మారి నేపథ్యంలోను సంఘటిత రంగంలో ఉపాధి పెరిగినట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021 జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరి మాసంలో నికర వినియోగదారులు 3.52 శాతం పెరిగింది.

గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా 69.58 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు అదనంగా చేరారు. 4.81 లక్షలమంది ఈపీఎఫ్ఓ నుండి నిష్క్రమించి మళ్లీ చేరారు. అంటే వీరు ఉద్యోగాలు మారారు. ఫైనల్ సెటిల్మెంట్‌కు బదులు నిధుల బదలీ చేసుకొని సభ్యత్వానని అట్టిపెట్టి ఉంచుకున్నారు.

EPFO net new enrolments grow nearly 20 percent to 12.37 lakh in February

ఫిబ్రవరి 2021 నెలలో 22-25 వయసు వారు 3.29 లక్షల మంది, 29-35 ఏళ్ల వారు 2.51 లక్షల మంది జత కలిశారు. నిపుణుల సేవల విభాగంలో 4.99 లక్షల మంది, ట్రేడింగ్ వాణిజ్య సంస్థల విభాగంలో 84,000 మంది చేరారు. మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు నికర నమోదులో ముందు ఉన్నాయి. ఈ అయిదు కలిపి మొత్తం నికర ఖాతాదారుల నమోదులో 54.81 శాతాన్ని కలిగి ఉన్నాయి. ఫిబ్రవరిలో నమోదైన నికర ఖాతాదారుల్లో 21 శాతం వాటా మహిళలది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+