ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఉద్యోగులు తమ భవిష్యత్తు కోసం జమ చేసే నిధిని కాపాడుతూ వస్తున్న ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. ఒక ఉద్యోగి అనుకోకుండా మరణిస్తే, ఆతని కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో వారికి కొంత సహాయం అందించాలని EPFO అనేక ఏళ్లుగా ఒక ఎక్స్‌గ్రేషియా (మరణ ఉపశమనం) స్కీమ్ అమలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ మొత్తాన్ని రూ. 8.8 లక్షలుగా నిర్ణయించారు. అయితే కాలం మారింది... దాంతో పాటుగా ఖర్చులు పెరిగాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, EPFO తన సభ్యుల కుటుంబాలకు ఆర్థికంగా మరింతగా అండగా నిలవాలని నిర్ణయించింది.
2025 ఏప్రిల్ 1 నుండి, EPFO మరణాంతర సాయాన్ని రూ. 8.8 లక్షల నుండి రూ. 15 లక్షలకు పెంచింది. అంటే, ఒక ఉద్యోగి ఈ తేదీ తర్వాత మరణిస్తే, ఆయన కుటుంబం లేదా చట్టబద్ధమైన వారసుడు ముందుకన్నా ఎక్కువ మొత్తాన్ని పొందనున్నారు.
ఈ సహాయం మొత్తాన్ని సిబ్బంది సంక్షేమ నిధి (Staff Welfare Fund) నుంచి చెల్లిస్తారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రభుత్వం, యజమానులు, ఉద్యోగులు.. ఇలా మూడు వర్గాల ప్రతినిధులు ఉంటారు.

ఇక ఈ సహాయం మొత్తాన్ని ఒక స్థాయిలో నిలిపివేయకుండా, 2026 ఏప్రిల్ 1 నుండి ప్రతి ఏడాది 5% పెరుగుదల ఇవ్వాలని కూడా EPFO నిర్ణయించింది. అంటే భవిష్యత్తులో ద్రవ్యోల్బణం ఎంత పెరిగినా, ఈ సాయం కుటుంబాలకు నిజంగా ఉపయోగపడేలా ఉంటుంది. కేవలం మొత్తాన్ని పెంచడమే కాదు, EPFO కుటుంబాలకు ఈ డబ్బు చేరే విధానాన్ని కూడా సులభతరం చేసింది.
గార్డియన్‌షిప్ సర్టిఫికెట్ అవసరం లేదు: ఉద్యోగి మరణించి, ఆయన PF మొత్తాన్ని మైనర్ పిల్లలకు ఇవ్వాల్సి వస్తే, ఇంతవరకు గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ తప్పనిసరి. దీని వలన డబ్బు రావడానికి ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఆ షరతును ఎత్తివేశారు. దీంతో కుటుంబానికి డబ్బు త్వరగా చేరుతుంది.
ఆధార్ అప్‌డేట్ సులభతరం: PF ఖాతా నంబర్ (UAN) తో ఆధార్ లింక్ చేయని లేదా ఆధార్‌లో పొరపాట్లు ఉన్నవారు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ ప్రక్రియను EPFO మరింత సులభతరం చేసి వేగవంతం చేసింది. ఆధార్ వివరాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవరించుకోవచ్చు.
కుటుంబాలకు నిజమైన భరోసా: ఈ నిర్ణయం వల్ల ఉద్యోగి ఆకస్మిక మరణం తర్వాత కుటుంబం ఆర్థికంగా కూలిపోకుండా ఉండేందుకు పెద్ద అండ లభించనుంది. రూ. 15 లక్షలతో పాటు ప్రతి సంవత్సరం 5% పెరుగుదల ఉండటంతో, భవిష్యత్తులో ఈ సాయం విలువ తగ్గకుండా ఉంటుంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్‌డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications