ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. 'EPFO 3.0' పేరుతో రాబోతున్న ఈ కొత్త వెర్షన్ ద్వారా కోట్లాది మంది సభ్యులకు అందించే సేవలను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కేవలం పాత సాఫ్ట్‌వేర్ అప్ డేట్ మాత్రమే కాదు, పీఎఫ్ వ్యవస్థను ఒక ఆధునిక బ్యాంకులా మార్చే ప్రక్రియ. దీనికి సంబంధించిన టెండర్లు కూడా త్వరలోనే ఖరారు కానున్నాయి.

ఏమిటీ EPFO 3.0? దీని వల్ల లాభాలేంటి?
ప్రస్తుతం ఉన్న సిస్టమ్ లో ఏవైనా ఫిర్యాదులు ఉంటే మీ ఖాతా రిజిస్టర్ అయిన ఆఫీసుకే వెళ్లాల్సి వచ్చేది. కానీ EPFO 3.0 అమల్లోకి వస్తే, దేశంలోని ఏ ఈపీఎఫ్‌ఓ కార్యాలయం నుండైనా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు (Centralised Operations). ఇది సరిగ్గా బ్యాంకుల 'కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్' (CBS) తరహాలో పనిచేస్తుంది. దీనివల్ల లావాదేవీల వేగం పెరగడమే కాకుండా, అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఈ సామాజిక భద్రతా నెట్‌వర్క్ ను విస్తరించడం సులభమవుతుంది.
UPI ద్వారా నగదు విత్ డ్రా.. అదిరిపోయే ఫీచర్!
EPFO 2.0 లో భాగంగా జరుగుతున్న మార్పుల్లో అత్యంత ఆసక్తికరమైనది UPI ద్వారా నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం. ఏప్రిల్ నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సభ్యులు BHIM యాప్ ద్వారా తమ మొత్తం బ్యాలెన్స్ చూడటమే కాకుండా.. నగదు అవసరమైనప్పుడు సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రారంభంలో ఒక ట్రాన్సాక్షన్ కు రూ. 25,000 వరకు లిమిట్ ఉండే అవకాశం ఉంది. పెళ్లిళ్లు, చదువు, అనారోగ్యం వంటి మూడు ముఖ్యమైన విభాగాల కింద ఈ విత్‌డ్రా రూల్స్ ను ప్రభుత్వం మరింత సరళతరం చేసింది.
AI , మాతృభాషలో సేవలు
భాషా సమస్యలను తొలగించేందుకు EPFO 3.0 లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 'భాషిణి' (Bhashini) ప్లాట్‌ఫారమ్ ద్వారా సభ్యులకు వారి మాతృభాషలోనే సమాచారాన్ని అందించనున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికులు కూడా ఎవరి సాయం లేకుండా తమ పీఎఫ్ వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే పేరు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను యజమాని (Employer) ప్రమేయం లేకుండానే సభ్యులు స్వయంగా సరిదిద్దుకునే (Self-Correction) సదుపాయం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..
ప్రస్తుతం దాదాపు 8 కోట్ల మంది క్రియాశీల సభ్యులు , రూ. 28 లక్షల కోట్ల నిధులను ఈపీఎఫ్‌ఓ నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో గిగ్ వర్కర్లు (Gig Workers) , ప్లాట్ ఫారమ్ వర్కర్లకు కూడా పీఎఫ్ వర్తింపజేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇంత భారీ స్థాయిలో డేటాను హ్యాండిల్ చేయడానికి విప్రో, ఇన్ఫోసిస్ లేదా టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీల సహకారంతో కొత్త ఐటీ ప్లాట్‌ఫారమ్ ను EPFO 3.0 లో భాగంగా నిర్మిస్తున్నారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా సభ్యులకు మరింత మెరుగైన డిజిటల్ అనుభూతిని అందిస్తుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications