ఇకపై ఉద్యోగాలు మారేటప్పుడు EPF (Employees' Provident Fund) బదిలీ కోసం ఫారమ్‌లు పూరించాల్సిన అవసరం లేదా యజమాని ఆమోదం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. EPFO (Employees' Provident Fund Organisation) కొత్త ఆటోమేటిక్ EPF ట్రాన్స్‌ఫర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఇది 2025 నాటికి పూర్తిగా అమల్లోకి రానుంది. ఈ మార్పు ఉద్యోగులకు ఒక పెద్ద ఉపశమనం కలిగించనుంది. ముఖ్యంగా తరచుగా ఉద్యోగాలు మార్చే ప్రైవేట్ రంగ సిబ్బందికి ఇది చాలా సింపుల్ కానుంది.
ఇప్పటి వరకు ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు ఫారమ్ 13 నింపి..మునుపటి యజమానులతో పాటుగా కొత్త యజమానుల ధృవీకరణ పొందాలి. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేది. కొన్నిసార్లు ఒకటి నుండి రెండు నెలలు కూడా పట్టేది. టెక్నికల్ లోపాలు, యజమానుల ఆలస్యం లేదా దరఖాస్తు లోపాల కారణంగా అనేక EPF బదిలీ క్లెయిమ్‌లు తిరస్కరించబడ్డాయి. EPFO డేటా ప్రకారం.. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉండేవి.

ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరించేందుకు EPFO ఆటోమేటెడ్ ట్రాన్స్‌ఫర్ వ్యవస్థను రూపొందించింది.ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే.. అతని UAN (Universal Account Number) ఆధారంగా EPF బ్యాలెన్స్ స్వయంచాలకంగా కొత్త యజమాని ఖాతాకు బదిలీ అవుతుంది. దీనికి ఎటువంటి మాన్యువల్ చర్య, డాక్యుమెంట్ అప్‌లోడ్, లేదా యజమాని ఆమోదం అవసరం ఉండదు.
ఉద్యోగి తన కొత్త యజమాని వద్ద చేరిన తర్వాత యజమాని కొత్త PF ఖాతాను UAN ద్వారా యాక్టివేట్ చేస్తాడు. EPFO డేటాబేస్ ఉద్యోగి పాత, కొత్త PF ఖాతాలను ఆటోమేటిక్‌గా మ్యాప్ చేస్తుంది. ఈ సిస్టమ్ బ్యాలెన్స్‌ను మూడు నుండి ఐదు రోజుల్లో ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఉద్యోగికి SMS, EPFO పోర్టల్‌లో నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా బదిలీ స్థితిని ట్రాక్ చేయవచ్చు.
EPF ఆటోమేటిక్ బదిలీ వ్యవస్థ ప్రయోజనాలు
1. సమయం ఆదా: గతంలో నెలలు పట్టే బదిలీలు ఇప్పుడు కేవలం 3-5 రోజుల్లో పూర్తవుతాయి.
2. అవాంతరాలు లేని ప్రక్రియ: ఇకపై ఫారమ్ 13 లేదా డాక్యుమెంట్ అప్‌లోడ్ అవసరం లేదు. సిస్టమ్ స్వయంగా బదిలీ చేస్తుంది.
3. వడ్డీ నష్టం లేదు: బదిలీ సమయంలో కూడా EPF బ్యాలెన్స్‌పై వడ్డీ కొనసాగుతుంది.
4. ఒకే ఖాతాలో సేవింగ్స్: ఉద్యోగి కెరీర్ మొత్తంలో EPF డబ్బు ఒకే ఖాతాలో కన్సాలిడేట్ అవుతుంది, రిటైర్మెంట్ సమయంలో లెక్కలు సులభంగా ఉంటాయి.
5. ఉద్యోగ మార్పిడి సులభం: ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ప్రైవేట్ రంగాల్లో తరచుగా ఉద్యోగాలు మారే వారికి ఇది బిగ్ రిలీఫ్.
EPFO ప్రధాన లక్ష్యం ఏంటంటే.. పేపర్‌లెస్, ఫాస్ట్, ట్రాన్స్‌పరెంట్ సర్వీస్. ఆటోమేటెడ్ ట్రాన్స్‌ఫర్ వ్యవస్థ ద్వారా EPFO పని భారాన్ని కూడా తగ్గిస్తుంది, పెద్ద యజమానులకు మాన్యువల్ ఆమోదం అవసరం లేకుండా చేస్తుంది. EPF బదిలీ ఆటోమేటిక్ వ్యవస్థ ఉద్యోగులకు సౌకర్యం, పారదర్శకత, వేగం కలిగిస్తుంది. 2025లో ఇది పూర్తిగా అమల్లోకి వస్తే, EPFO సర్వీసులు పూర్తిగా డిజిటల్ దిశగా అడుగు వేస్తాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications