భారత ఎంటర్‌ప్రెన్యూయర్‌కు షాక్, బార్‌క్లేస్‌కు 131 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశం
దిగ్గజ కంపెనీ బార్‌క్లేస్‌కు భారత ఎంటర్‌ప్రెన్యూయర్ రఘురాం 131 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్ఎంసీ హెల్త్ ఫౌండర్ అయిన ఇతనిపై బార్‌క్లేస్ లీగల్ ఫైట్‌ను గెలుచుకుంది. ఇండియన్ అబుదాబీ బిలియనీర్‌గా చెప్పే రఘురాం అలియాస్ బీఆర్ శెట్టికి ఇది భారీ షాక్. ఫారెన్ ఎక్స్చేంజ్ బిజినెస్ ట్రాన్సాక్షన్‌లో భాగంగా లండన్ బ్యాంకు బార్‌క్లేస్‌కు ఈ మొత్తం చెల్లించాలని లండన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మన కరెన్సీలో 131 మిలియన్లు అంటే రూ.960 కోట్లకు పైన.
2020లో లంబన్ బ్యాంకు బార్‌క్లేస్ ఫారెన్ ఎక్ఛేంజీ బిజినెస్ ట్రాన్సక్షన్స్ ఒప్పందంలో భాగంగా రఘురాం సదరు బ్యాంకుకు పెద్ద మొత్తంలో చెల్లించవలసి ఉంది. ఇదే అంశంపై దుబాయ్ కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీంతో దుబాయ్ కోర్టు తీర్పును ఆయన లండన్ కోర్టులో సవాల్ చేశారు. ఈ కేసుపై గత నెల డిసెంబర్‌లో యూకే కోర్టు విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా రఘురాం తరఫు లాయర్లు తన క్లయింట్ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నారని, తీర్పును వాయిదా వేయాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు కేసును జనవరి 10, 2022కు వాయిదా వేసింది.
పదో తేదీన మరోసారి విచారణ చేపట్టిన లండన్ కోర్టు రఘురాం అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో బార్‌క్లేస్‌కు చెల్లించాల్సి ఉన్న తన క్లయింట్ రఘురాం ఆస్తులు స్తంభించి పోయాయని, తీర్పును మరోసారి వాయిదా వేసేలా కోర్టుకు విన్నవించుకున్నారు. కానీ లండన్ కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. బార్‌క్లేస్‌కు 131 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.


Click it and Unblock the Notifications