ఎంటరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) శుక్రవారం ఓపెన్ అయింది. పబ్లిక్ ఇష్యూ బిడ్డర్‌ల కోసం 13 ఫిబ్రవరి 2024 వరకు తెరిచి ఉంటుంది. హెల్త్‌కేర్ ఉత్పత్తుల పంపిణీ సంస్థ ఎంటరో హెల్త్ కేర్ సొల్యూషన్స్ ఐపీఓ ధర బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీకి రూ.1195 నుంచి రూ.1258గా నిర్ణయించింది. ఈ ఇష్యూ ద్వారా 1600 కోట్లను సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో రూ.1000 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా లక్ష్యంగా పెట్టుకుంది.
ఎంటరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ తేదీకి ముందు ఎంటరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్లు గ్రే మార్కెట్‌లో ట్రేడ్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం శుక్రవారం గ్రే మార్కెట్‌లో ఎంటరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్లు రూ.126 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి.

హెల్త్‌కేర్ ఉత్పత్తుల పంపిణీదారు ఎంటరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ తన IPO ప్రారంభానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 8న తన యాంకర్ బుక్ ద్వారా రూ.716.4 కోట్లను సమీకరించింది. ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన ఫైలింగ్‌లో, ఫరీదాబాద్‌కు చెందిన కంపెనీ 56,94,753 ఈక్విటీ షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరు ధర రూ.1,258 చొప్పున కేటాయించినట్లు తెలిపింది.
గ్లోబల్ మార్క్యూ ఇన్వెస్టర్లు స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ ఇంక్, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, కార్మిగ్నాక్ పోర్ట్‌ఫోలియో, CLSA గ్లోబల్, సొసైటీ జనరల్, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాక్స్, కోప్తాల్ మారిషస్ ఇన్వెస్ట్ మెంట్ యాంకర్ బుక్‌లో పాల్గొన్నాయి.అముండి ఫండ్స్, జూపిటర్ ఇండియా ఫండ్, ఎస్‌బిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రైవేట్ క్లయింట్ ఎమర్జింగ్ మార్కెట్స్ పోర్ట్‌ఫోలియో, మాగ్నా అంబ్రెల్లా ఫండ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, టిటి ఎమర్జింగ్ మార్కెట్స్ అన్‌కన్‌స్ట్రెయిన్డ్ ఫండ్, అలియన్జ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఫండ్ కూడా కంపెనీలో పెట్టుబడి పెట్టాయి.
బిడ్డింగ్ మొదటి రోజు 11:45 AM నాటికి, బుక్ బిల్డ్ ఇష్యూ 0.04 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది. అయితే దాని రిటైల్ భాగం 0.19 సార్లు బుక్ అయింది. పబ్లిక్ ఇష్యూలో ఉద్యోగుల భాగం 0.14 రెట్లు సబ్‌స్క్రైబ్ చేశారు. పబ్లిక్ ఇష్యూ యొక్క NII భాగం 0.01 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది.


Click it and Unblock the Notifications