ఈ మధ్య కాలంలో ఓ హై కోర్ట్ న్యాయవాది ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు వెలుగు చూడటం పెద్ద దుమారం రేగింది. అయితే ఇది మరవకముందే మరో ఉదంతం బయటపడింది. గత వారం బీహార్ ప్రభుత్వ సీనియర్ అధికారులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రూ.11.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే బీహార్ భవన నిర్మాణ విభాగం చీఫ్ ఇంజనీర్ తరిణి దాస్ ఇంటితో సహా పాట్నాలోని ఏడు చోట్ల ఈ సోదాలు జరిగాయని అధికారులు తెలపగా, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ ముముక్షు చౌదరి, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్ కుమార్ సింగ్ తదితరుల ఇళ్లలో కూడా దాడులు జరిగాయి.

మరోవైపు BUIDCO డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయాజ్ అహ్మద్, BMSICLలో DGM (ప్రాజెక్ట్స్) సాగర్ జైస్వాల్, BMSICLలో DGM వికాస్ ఝా, బీహార్ భవన నిర్మాణ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాకేత్ కుమార్ ప్రాంగణాల్లో కూడా సోదాలు జరిగాయని ఫెడరల్ ఏజెన్సీ విడుదల చేసిన ఒక ప్రకటన వెల్లడించింది. పాట్నాకు చెందిన కాంట్రాక్టర్ రిషు శ్రీతో సహా వివిధ కాంట్రాక్టర్లకు టెండర్లు ఇంకా బిల్లుల క్లియరెన్స్‌లో అధికారులు లంచం తీసుకున్నారని ED వర్గాలు ఆరోపించాయి. ఈ ఆపరేషన్ సమయంలో రూ.11.64 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో వెల్లడించింది, దినితో పాటు అధికారుల మధ్య లంచం డబ్బు పంపకాలకు సంబంధించిన పేపర్స్, ఇతర నేరారోపణ ఆధారాలు కూడా కనుగొన్నారు. అయితే, ప్రతి అధికారి నుండి ఎంత మొత్తం పట్టు బడింది అనే దానిపై పూర్తి వివరాలను అందించలేదు, అయితే విరందరూ కూడా ED నిఘాలో ఉన్నారు.
తాజా సోదాలు సంబంధిత విభాగాలలోని ఉన్నతాధికారులలో కూడా భయాందోళనలు కలిగించాయి. సంజీవ్ హన్స్ పై గత సంవత్సరం బీహార్ పోలీసుల ప్రత్యేక విజిలెన్స్ విభాగంలో కేసు నమోదైంది. రాష్ట్ర ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శిగా చివరిగా పనిచేసిన హన్స్ ను అరెస్టు చేసి, దర్యాప్తు అధికారులు అతనిపై ఆధారాలు కనుగొన్న తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా లెక్కల్లో చూపని డబ్బు కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు ఉండగా, 2018 నుండి 2023 వరకు వివిధ విభాగాలలో ఆయన పోస్టింగ్‌లపై కూడా ED దర్యాప్తు చేస్తోంది. అయితే తరిణి దాస్ బంగ్లాలోకి ప్రవేశించిన అధికారులు కొన్ని గదుల్లో పేర్చబడి ఉన్న భారీ మొత్తంలో కరెన్సీ నోట్లను చూసి ఆశ్చర్యపోయారని సమాచారం. ED దర్యాప్తును కొనసాగిస్తున్నందున, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా వెలువడే అవకాశం ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications