కొత్తగా ఉద్యోగంలో చేరాలని కోరుకుంటున్న వారికి శుభవార్త! గత క్యాలెండర్ ఏడాది (2021) రెండో అర్ధ సంవత్సరంతో పోలిస్తే ఈ క్యాలెండర్ సంవత్సరం (2022) మొదటి అర్ధ సంవత్సరంలో 30 శాతం ఎక్కువ నియామకాలు చేపట్టనున్నాయి కంపెనీలు. ఈ మేరకు కొత్తవారిని తీసుకోనున్నారు. ఐటీ, టెలికం, ఈ-కామర్స్ వ్యాపారాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ విడుదల చేసిన కెరీర్ ఔట్ లుక్ రిపోర్ట్ ప్రకారం 2021 జూలై-డిసెంబర్ కంటే 2022 జనవరి - జూన్ కాలంలో 30 శాతం ఎక్కువగా ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నారు. అలాగే, క్రితం అర్ధ సంవత్సరంలో కేవలం 17 శాతం కంపెనీలు మాత్రమే ఫ్రెషర్స్ పైన దృష్టి సారించగా, ప్రస్తుత అర్ధ సంవత్సరంలో అది 47 శాతం కంపెనీలకు పెరిగింది.

ఐటీ అదుర్స్
ఐటీ రంగం ఎక్కువ మంది ఫ్రెషర్స్‌ను తీసుకోవడానికి ఆసక్తిగా ఉంది. 57 శాతం మందిని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రాంతాలవారీగా చూస్తే బెంగళూరు 59 శాతంతో మొదటి స్థానంలో ఉండనుంది. ఆ తర్వాత ముంబై (43 శాతం), ఢిల్లీ (39 శాతం) ఉంటాయి. ఐటీ తర్వాత ఇతర రంగాల విషయానికి టెలికం, ఈ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్స్ ఉన్నాయి. హాస్పిటాలిటీ, ట్రావెల్ రంగాల్లో నియామకాలు 2 శాతం పెరిగింది. అన్ని రంగాల్లో ఫ్రెషర్స్ లేదా ఎక్స్‌పీరియన్స్ హైరింగ్ గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 31 శాతం నుండి 50 శాతానికి పెరుగుతాయని అంచనా. ఉద్యోగం ఇచ్చేందుకు అభ్యర్థుల విద్యానైపుణ్యాలతో పాటు వ్యక్తిగత లక్షణాలను కంపెనీలు పరిగణలోకి తీసుకుంటున్నాయి.

డిమాండ్ వీటికే
నిర్మాణం, రియాల్టీ, వ్యవసాయం, వ్యవసాయ రసాయనాలు, రిటైల్, ఎఫ్ఎంసీజీ, మార్కెటింగ్, అడ్వర్టైజ్‌మెంట్, మీడియా, వినోద రంగాల్లోని కంపెనీలలో నియామకాలపై ఆసక్తి తగ్గింది.
డేటా అనలటిక్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్, వీఆర్, కంటెంట్ రైటింగ్ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్, టెక్నికల్ రైటర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సప్లై చైన్ అనలిస్ట్ ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది. ఫ్రెషర్లు అయితే విశ్లేషణా సామర్థ్యాలు, ఇన్నోవేషన్, ఒత్తిడిని నియంత్రించుకోవడం, సమాచార నైపుణ్యాలు, భావోద్వేగాల నియంత్రణ, సానుకూల దృక్పథాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఐటీలో వలసల ఆందోళన
ఐటీ పరిశ్రమలో వలసలు ఆందోళనగా ఉండటంతో నైపుణ్యం, ప్రతిభ కలిగిన ఉద్యోగులు చేజారిపోకుండా చాలా సంస్థలు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా వేతన పెంపు, ఇతర ఇన్సెంటివ్స్, పదోన్నతులు ఇస్తున్నాయి. ఉద్యోగులవారీగా 8 శాతం నుండి 20 శాతం వరకు వేతన పెంపు ఉంది.
ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 3.6 లక్షల మంది ఫ్రెషర్లకు ఉపాధి కల్పిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 19 శాతం నుండి 21 శాతం మేర వృద్ధి చెంది 23,000 నుండి 24,000 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications