ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ సంవత్సరం పన్ను రూపంలో ఎంత చెల్లించనున్నారో తెలుసా? మస్క్ పన్నులు చెల్లించడం లేదనే విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్లా, స్పేస్ ఎక్స్ సహా ఇతర వెంచర్స్ ద్వారా ఆర్జిస్తున్న రాబడులకు తగిన పన్నులు చెల్లించడం లేదనే విమర్శలకు చెక్ పెట్టారు. ఈ ఏడాది తన రాబడుల పైన తాను పన్ను చెల్లిస్తున్నానని చెప్పడంతో పాటు, ఎంత మేర చెల్లిస్తున్నదీ వెల్లడించారు. ఈ సంవత్సరం తాను రూ.83,624 కోట్లను పన్నుల కింద చెల్లిస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు.

విమర్శలకు ధీటుగా..
మస్క్ తాను చెప్పినట్లుగా ఇంత పెద్ద మొత్తం చెల్లిస్తే అమెరికన్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్‌కు ఇప్పటివరకు సమకూరిన భారీ ట్యాక్స్ ఫైలింగ్ ఇదే అవుతుంది. తాను పన్నులు చెల్లించడం లేదని చెబుతున్న వారి కోసం ఈ వివరాలు వెల్లడిస్తున్నానని తెలిపారు. ఈ ఏడాది తాను 1100 కోట్ల (రూ 83,624 కోట్లు) డాలర్ల పన్ను చెల్లిస్తానని ట్వీట్ ద్వారా తెలిపారు. మస్క్ సరైన విధంగా పన్నులు చెల్లించడం లేదని మసాచుసెట్స్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ అన్నారు. దీనిపై మస్క్ వ్యాఖ్యానిస్తూ చరిత్రలో ఏ అమెరికన్ చెల్లించని విధంగా తాను పన్నులు అధికంగా చెల్లిస్తున్నానన్నారు.

ఏటిమేటి వ్యక్తికి చురక
ఇటీవల టైమ్ మేగజైన్ ఈ ఏటి మేటి వ్యక్తిగా ఎలాన్ మస్క్‌ను ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. అదే సమయంలో పన్నులను ఎగవేస్తున్నట్లు విమర్శల జడివాన మొదలైంది. ఎలిజబెత్ వారెన్ ట్వీట్ చేస్తూ పన్నులను ఎగవేసే పద్ధతిని మారుద్దామని పేర్కొంటూ, ది పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఈసారి వాస్తవ పన్నులు చెల్లిస్తారంటూ పరోక్షంగా ఎలాన్ మస్క్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సెనేటర్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ పైవిధంగా బదులిచ్చారు.

టెస్లా మార్కెట్ వ్యాల్యూ
ఇక ఈ ఏడాది ఒక్క టెస్లా మార్కెట్ వ్యాల్యూ దాదాపు లక్ష కోట్ల (1 ట్రిలియన్) డాలర్ల మార్కును దాటింది. దీని వ్యాల్యూ ఫోర్డ్ మోటార్స్, జనరల్ మోటార్స్ రెండింటి వ్యాల్యూ కంటే ఎక్కువ కావడం గమనార్హం. గతకొన్ని వారాలుగా టెస్లా షేర్లను విక్రయిస్తోన్న ఆయన, ఇప్పటికే దాదాపు 14 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications