కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు ప్రభుత్వ ఆంక్షల మేరకు క్లోజ్ అయ్యాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎలాన్ మస్క్‍కు చెందిన టెస్లా కాలిఫోర్నియా కంపెనీ ఓపెన్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా దీనిని ఓపెన్ చేశారు. టెస్లా ప్రపంచ ప్రఖ్యాత విద్యుత్ కార్ల తయారీ కంపెనీ. ఇది కాలిఫోర్నియాలో తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.

అనుమతి లేకుండా ఓపెన్
స్థానిక అధికారులు అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ సీఈవో ఎలాన్ మస్క్ దీనిని తెరిచారు. ఒకవేళ కంపెనీ పునరుద్ధరణకు అనుమతి ఇవ్వకుంటే టెక్సాస్ లేదా నెవడాకు ప్రధాన కార్యాలయాన్ని మారుస్తామని అంతకుముందే కాలిఫోర్నియా ప్రభుత్వాన్ని హెచ్చరించారు మస్క్. మరుసటి రోజు దీనిని ప్రారంభించారు. ఆయన కంపెనీ ఉద్యోగులు, కార్మికులకు లేఖ కూడా రాశారు.

నన్ను అరెస్ట్ చేయాలి
సోమవారం నుండి కంపెనీ సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవుతాయని ఆ లేఖలో ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఇది అలమెడా స్థానిక ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, ముందుకే వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కంపెనీని తెరిచినందుకు ఒకవేళ అధికారులు ఎవరినైనా అరెస్టు చేయాలని భావిస్తే తనను అరెస్ట్ చేయాలని మస్క్ సవాల్ విసిరారు. కాలిఫోర్నియా గవర్నర్ అనుమతించినప్పటికీ అలమెడా అధికారులు వాటిని ఉల్లంఘిస్తున్నారన్నారు. ఉద్యోగుల భద్రత కోసం తాము చర్యలు తీసుకున్నామని చెప్పారు.

23 నుండి క్లోజ్
కరోనా మహమ్మారి కారణంగా ఈ ప్లాంట్ మార్చి 23వ తేదీ నుండి క్లోజ్ ఉంది. అనుమతులు లేకుండా ఓపెన్ చేస్తే 1000 డాలర్ల జరిమానా, 90 రోజుల జైలు శిక్ష విధించే అవకాశముంది. సోమవారం 10,000 మంది వర్కర్లతో ఇది ప్రారంభమైంది. అయితే ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో తెరుస్తామని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications