2025 నాటికి 7% నుండి 17% తగ్గనున్న విద్యుత్ డిమాండ్!

ఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా విద్యుత్ వినియోగం భారీగా తగ్గనుందని, 2025 సంవత్సరం నాటికి 7శాతం నుండి 17శాతం మేర డిమాండ్ తగ్గవచ్చునని TERI (ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్) నివేదిక తెలిపింది. దేశంలో అత్యంత ఎక్కువగా విద్యుత్ వినియోగించే 10 రాష్ట్రాల్లోనే 5 శాతం నుండి 15 శాతం మేర డిమాండ్ తగ్గుతుందని పేర్కొంది.

అయితే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ లాక్ డౌన్ నేపథ్యంలో ఇది తాత్కాలిక ప్రభావమేనని, డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ ఉన్నప్పటికీ డిమాండ్ ఉంటుందని, దీర్ఘకాలంలో ఎలక్ట్రిస్టీ డిమాండ్ పైన ప్రభావం ఉంటుందని భావించడంలేదని, ఇది నెమ్మదిగా పెరుగుతుందన్నారు.

Electricity demand will decline 7-17 percent by 2025 due to corona

'బెండింగ్ ఆఫ్ ది కర్వ్: 2025 ఫోర్‌కాస్ట్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ బై సెక్టార్ అండ్ స్టేట్ ఇన్ ది లైట్ ఆఫ్ కోవిడ్ ఎపిడెమిక్' శీర్షికతో ఈ నివేదికను తయారు చేశారు. పాలకులు, డెవలపర్స్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ఇన్వెస్టర్లు ఇందుకు అనుగుణంగా సిద్ధం కావాలని కూడా సూచించింది. ప్రత్యేకించి వాణిజ్య, పారిశ్రామిక డిమాండ్‌లో క్షీణత నమోదు కావొచ్చునని, డిస్కంలకు ఆర్థిక ఒత్తిడి ఎదురు కావొచ్చునని అభిప్రాయపడింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+