హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు వాటర్ షాక్.. నీటి కోసం మూడు రెట్లు అధికంగా చెల్లిస్తున్న బిల్డర్లు..

El Niño Threat: హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, దీనికి తోడు పొంచి ఉన్న ఎల్ నినో (El Nino) ముప్పు హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఇప్పటికే గృహ అవసరాల కోసం ప్రజలు ప్రైవేట్ నీటి ట్యాంకర్లపై ఆధారపడుతుండగా.. ఇప్పుడు నిర్మాణ పనులకు కూడా నీటి కొరత, పెరిగిన ఖర్చులు పెను భారంగా మారుతున్నాయి.

భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో కొత్త బోర్‌వెల్ అనుమతులపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఫలితంగా గతంలో బోర్ నీటిపై ఆధారపడిన బిల్డర్లు ఇప్పుడు అనివార్యంగా ప్రైవేట్ ట్యాంకర్ల వైపు చూడాల్సి వస్తోంది. సాధారణంగా బోర్‌వెల్ నీటికి అయ్యే రూ. వేయి ఖర్చుతో పోలిస్తే.. ప్రస్తుతం ఒక్కో ప్రైవేట్ ట్యాంకర్‌కు సుమారు రూ. 3 వేల వరకు చెల్లించాల్సి వస్తుండటంతో ప్రాజెక్ట్ బడ్జెట్లు తలకిందులవుతున్నాయి.

Hyderabad water crisis El Ni o impact Hyderabad construction sector water shortage Hyderabad builders water costs tanker water prices Hyderabad real estate construction costs groundwater depletion water stress real estate sector news Hyderabad property market

ఈ నీటి సంక్షోభం ప్రభావం నిర్మాణ వ్యయంతో పాటు ప్రాజెక్టుల పూర్తి సమయంపై కూడా తీవ్రంగా పడుతోంది. నీటి కొనుగోలు ఖర్చుల కారణంగా నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు సుమారు రూ. 10 మేర పెరిగిందని డెవలపర్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 2027 మధ్య నాటికి వినియోగదారులకు అప్పగించాల్సిన నివాస ప్రాజెక్టులు నీటి కొరత వల్ల కనీసం ఆరు నెలల పాటు ఆలస్యమై.. 2027 చివరికి లేదా 2028లోకి వెళ్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మాణ కార్యకలాపాలు అత్యధికంగా సాగుతున్న మియాపూర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీతో కూడిన పశ్చిమ కారిడార్‌లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది.

Also Read

చిన్న నిర్మాణ సంస్థలు, స్వతంత్ర భవనాల యజమానులపై ఈ ఆర్థిక భారం మరింత ఎక్కువగా పడుతోంది. ఐదు నుండి ఏడు అంతస్తుల స్వతంత్ర నివాస భవనానికి ప్రతి రెండు రోజులకొకసారి కనీసం ఒక ట్యాంకర్ నీరు అవసరమవుతోందని, దీనివల్ల నెలకు రూ. 25 వేల నుండి రూ. 30 వేల వరకు అదనపు ఖర్చు వస్తోందని సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యు. ఉదయ్ తెలిపారు. డిసెంబర్ నుండి జలాశయాల మట్టాలు మరింత తగ్గి, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటితే నిర్మాణ పనులు మందగించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

మరోవైపు 500 యూనిట్లకు పైగా ఉన్న భారీ గేటెడ్ కమ్యూనిటీలకు కాంక్రీట్ క్యూరింగ్, నిర్మాణ సామగ్రి కలపడం, కార్మికుల అవసరాల కోసం రోజుకు 10 నుండి 15 ట్యాంకర్ల నీరు అవసరమవుతోందని, నగరవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సుమారు 350 నుండి 400 ప్రాజెక్టులు ఈ సమస్యతో సతమతమవుతున్నాయని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రతినిధి వివరించారు.

ఈ తీవ్ర నీటి కొరతకు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ప్రారంభించిన 'గ్రీన్ వాటర్ ట్యాంకర్' కార్యక్రమం ఇప్పుడు క్రమంగా ఊపందుకుంటోంది. మురుగునీటి శుద్ధి కర్మాగారాల (STP) నుండి శుద్ధి చేసిన నీటిని కాంక్రీట్ క్యూరింగ్, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ వంటి త్రాగునీటియేతర అవసరాలకు వినియోగించుకునేందుకు కొంతమంది డెవలపర్లు ముందుకు వస్తున్నారు.

ఉదాహరణకు సైబరాబాద్‌లోని ఒక డెవలపర్ కోకాపేట్ ఎస్టీపీ నుండి ప్రతిరోజూ 90,000 నుండి 1.2 లక్షల లీటర్ల శుద్ధి చేసిన నీటిని గ్రీన్ ట్యాంకర్ల ద్వారా తరలిస్తూ నిర్మాణ పనులకు వాడుతున్నారు. అదేవిధంగా మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధిలోని ఒక అగ్రశ్రేణి సంస్థ సైతం ఎస్టీపీ నీటిని వినియోగిస్తోంది. శుద్ధి చేసిన నీటికి కొనుగోలుదారులు ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ.. రాబోయే వేసవి, ఎల్ నినో సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ విధానం బిల్డర్లకు ఒక ఆశాకిరణంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+