ద్రవ్యోల్భణం పెరుగుతున్న సమయంలో ఊరట వార్త. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారీగా పెరిగిన వంటనూనె ధరల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుందని, దీంతో ప్రధాన ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్స్ ధరలు లీటర్ పైన రూ.10 నుండి రూ.15 తగ్గిందని ది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ బుధవారం వెల్లడించింది. వనస్పతి, సోయాబీన్, సన్ ఫ్లవర్, ఆర్బీడీ పామోలిన్ నూనెల హోల్ సేల్, రిటైల్ ధరలు గత వారం రోజులుగా తగ్గుతున్నాయి.
తగ్గుతున్న వంట నూనె ధరల కారణంగా ద్రవ్యోల్భణం కాస్త అదుపులో ఉండేందుకు తోడ్పడుతుందని సంబంధిత శాఖ పేర్కొంది. దాదాపు అన్ని మేజర్ ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్స్ రూ.10 నుండి రూ.15 వరకు ధరను తగ్గించాయని తెలిపింది. ఉదాహరణకు ఫార్చూన్ సన్ ఫ్లవర్ లీటర్ ధర రూ.220 నుండి రూ.210కి తగ్గింది. గోల్డ్ డ్రాప్, ఫ్రీడమ్ వంటి నూనె ధరలు కూడా రూ.200 నుండి రూ.210 వరకు ఉండగా, ఇప్పుడు రూ.190 నుండి రూ.200 మధ్య ఉన్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి సన్ ఫ్లవర్ నూనె టన్ను ధర 1,800 డాలర్లుగా ఉందని, ఇది 1,200 డాలర్లకు చేరుకునే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. సోయా నూనె 1,500 డాలర్ల నుండి 1,200 డాలర్లకు, పామాయిల్ 1,300 డాలర్ల నుండి 1,000 డాలర్లకు మున్ముందు చేరవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications