ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్ OneXBet కేసులో భారీ మలుపు తిరిగింది. భారత ఆర్థిక నేర దర్యాప్తు సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో ముడిపడి ఉన్న భారీ స్థాయి మనీ లాండరింగ్ కేసులో నిందితులుగా భావిస్తున్న కొంతమంది ప్రముఖ క్రీడాకారులు, సినీ నటుల ఆస్తులను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌ను నిషేధించింది. అయినా, ఈ కేసు ద్వారా సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎలా ఇలాంటి అక్రమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రమోషన్లతో ముడిపడుతున్నారనే విషయం వెలుగులోకి వస్తోంది.
దర్యాప్తులో భాగంగా ఈ సంస్థ నుంచి చెల్లింపులు అందుకున్న పలువురు భారతీయ సెలబ్రిటీలు వాటిని తమ వ్యక్తిగత ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు తేలిందని, చట్టం ప్రకారం ఇది నేర ఆదాయం(proceeds of crime)గా పరిగణించబడుతుందని ED అధికారులు తెలిపారు. ఈ కేసులో కోట్ల రూపాయల విలువ చేసే స్థిర, చర ఆస్తులు దేశంలోనే కాకుండా విదేశాల్లో.. ముఖ్యంగా UAEలో కూడా గుర్తించినట్లు సమాచారం. వీటిని తాత్కాలికంగా అటాచ్ చేసి, ఆ తర్వాత చట్ట ప్రక్రియ ప్రకారం శాశ్వత స్వాధీనం చేసుకోనుంది. ప్రస్తుతం ఆస్తుల మూల్యాంకనం, లావాదేవీల విశ్లేషణ జరుగుతోందని జాతీయ మీడియా సంస్థ పీటీఐ తెలిపింది.

అధికారులు వెల్లడించిన ప్రకారం.. మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన నిధులతో సృష్టించిన లేదా కొనుగోలు చేసిన ఏ ఆస్తైనా నేరాల ద్వారా పొందిన ఆదాయమే. కాబట్టి నిందితులు వాటిని సద్వినియోగం చేసుకోకుండా అటాచ్ చేయడం అవసరమని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని వారాలుగా ED పలువురు ప్రముఖులను ప్రశ్నించింది. అందులో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, శిఖర్ ధావన్, అలాగే నటులు సోను సూద్,మిమి చక్రవర్తి (టీఎంసీ మాజీ ఎంపీ), బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా ఉన్నారు. అదనంగా కొన్ని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను కూడా ED రాడార్‌లోకి తెచ్చింది.
ఈ విచారణల్లో PMLA సెక్షన్ 50 కింద వాంగ్మూలాలు నమోదు అవుతున్నాయి. కొందరు తమకు చెల్లించిన ఎండార్స్‌మెంట్ ఫీజులు సంబంధిత ఖాతాల ద్వారా అందుకున్నట్లు ధృవీకరించారు. ఆ ఖాతాల స్టేట్‌మెంట్‌లు కూడా అధికారులకు అందించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధానంగా నిలిచిన పేరు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. ఆమె 1xBet బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందున ED సమన్లు జారీ చేసింది. అయితే.. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేదు.
'1xBet' కంపెనీ అంతర్జాతీయ బెట్టింగ్ రంగంలో 18 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వారి అధికారిక సమాచారం ప్రకారం, వెబ్‌సైట్, యాప్ 70 భాషల్లో అందుబాటులో ఉంది. దీని ద్వారా వినియోగదారులు వేలాది క్రీడా ఈవెంట్లపై పందెం వేసే అవకాశం పొందుతున్నారు. అయితే భారతదేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ చట్టవిరుద్ధం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చి రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించింది. ఈ నిషేధానికి ముందు మార్కెట్ అంచనాల ప్రకారం దేశంలో సుమారు 22 కోట్ల మంది వినియోగదారులు వివిధ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు కనెక్ట్ అయ్యి ఉండేవారని నివేదికలు చెబుతున్నాయి.
విచారణలో భాగంగా ED అధికారులు ప్రముఖులకు సంధిస్తున్న ప్రశ్నలు
1xBet వారిని ఎలా సంప్రదించింది?
చెల్లింపులు ఏ మార్గంలో జరిగాయి (హవాలా లేదా బ్యాంకింగ్)?
భారతదేశంలోనా లేక విదేశాల్లోనా చెల్లింపులు జరిగాయి?
భారతదేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని వారికి తెలుసా?
అనే ప్రశ్నలకు సమాధానాలు రికార్డ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒప్పందాల కాపీలు, ఈమెయిల్స్, పత్రాలు సమర్పించమని కూడా ఆదేశించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications