Hero Motocorp: మనీలాండరింగ్ కేసులో హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పవన్ ముంజాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరికొందరి స్థలాల్లో కూడా దాడి చేశారు.
మనీలాండరింగ్ వ్యవహారంలో దిల్లీ, గురుగ్రామ్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. అకౌంట్స్ లో చూపని విదేశీ కరెన్సీని కలిగి ఉన్నారనే ఆరోపణల దృష్ట్యా పవన్ ముంజాల్ సన్నిహితుడిని డిఆర్‌ఐ ఇటీవల పట్టుకుంది. దీంతో ఈడీ రంగంలోకి దిగినట్లు సమాచారం.

ఈడీ రైడ్ వార్తల నేపథ్యంలో హీరో మోటోకార్ప్ కంపెనీ షేర్ ఏకంగా 4 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం కంపెనీ షేర్లు ఏడాది కనిష్ఠ స్థాయి అయిన రూ.3,064 వద్ద ట్రేడవుతున్నాయి. దీనికి ముందు మార్చి 2022లో పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ ముంజాల్, దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్‌కార్ప్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే.
వాహనల అమ్మకాల సంఖ్య ప్రకారంగా హీరో మోటార్స్ 2001లో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించింది. గడచిన 20 ఏళ్లుగా ఈ రికార్డును తన పేరుపైనే కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఆసియా, ఆఫ్రికా, దక్షిణ- మధ్య అమెరికాలోని 40 దేశాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అయితే నెటిజన్లు మాత్రం ఈ దాడులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రోత్బలంతో జరుగుతున్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications