భారత అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ ఏజెన్సీ వాజిర్‌ఎక్స్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. రూ.2,790 కోట్ల ట్రాన్సాక్షన్స్ వ్యాల్యూ కలిగిన ఫారెన్ ఎక్స్చేంజ్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై వాజిర్‌ఎక్స్‌తో పాటు ఈ సంస్థ డైరెక్టర్లు నిశ్చల్, సమీర్‌లకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసుల అంశంపై వాజిర్‌ఎక్స్ కూడా స్పందించింది. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(FEMA) ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేసింది.

మనీ లాండరింగ్ పైన విచారణ
వాజిర్‌ఎక్స్ కంపెనీ జెన్‌మయి ల్యాబ్స్ ప్రయివేట్ ల్యాబ్స్ లిమిటెడ్ పేరు పైన రిజిస్ట్రర్ అయింది. డొమెస్టిక్ క్రిప్టోకరెన్సీ స్టార్టప్‌గా 2017 ఏడాదిలో ఈ కంపెనీకు అనుమతులు వచ్చాయి. చైనాకు చెందిన ఇల్లీగల్ ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ పైన కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ ట్రాన్‌జాక్షన్స్ జరిగినట్లు ఈడీ తెలిపింది. అలాగే, చైనా నుండి రూ.57 కోట్ల విలువైన డబ్బు భారత కరెన్సీలోకి మార్చేశారని, ఆ తర్వాత బినాన్స్ వాలెట్లలోకి పంపించారని తేలింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరపనుంది.

స్కాంపై ఆందోళన
వాజిర్‌ఎక్స్ సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించకుండా ట్రాన్సాక్షన్స్ జరిపిందని, FEMA మార్గదర్శకాలు ఉల్లంఘించిందని ఈడీ తెలిపింది. క్రిప్టోకరెన్సీని ప్రొత్సహించేందుకు కేంద్రం యత్నిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి స్కాంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈడీ నుండి నోటీసులు అందలేదని వాజిర్‌ఎక్స్ చెబుతోంది.

నోటీసులపై ఏమన్నదంటే
ఈడీ నుండి తమకు ఎలాంటి షోకాజ్ నోటీసు అందలేదని దేశీయ క్రిప్టో ఎక్స్చేంజ్ వాజిర్‌ఎక్స్ స్పష్టం చేసింది. తమ సంస్థ చట్టాలకు లోబడి పని చేస్తోందని వెల్లడించింది. వాజిర్‌ఎక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడులు పూర్తిగా సురక్షితమని తెలిపింది. ఎలాంటి దర్యాప్తుకైనా తాము సిద్ధమని పేర్కొంది.


Click it and Unblock the Notifications