చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ షియోమీకి ఈడీ షాక్ ఇచ్చింది. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు షియోమీ,ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఓ), డైరెక్టర్ సమీర్ బి రావు, మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) మను కుమార్ జైన్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసింది. 5,551 కోట్లకు సంబంధించి మూడు విదేశీ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఫెమా నిబంధనలు ఉల్లంగించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు చెప్పింది.
అడ్జుడికేటింగ్ అథారిటీ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) FEMAలోని సెక్షన్ 16 కింద Xiaomi టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థకు చెందిన ఇద్దరు అధికారులు, సిటీ బ్యాంక్, HSBC బ్యాంక్, డ్యుయిష్ బ్యాంక్ AGకి నోటీసులు ఇచ్చింది. నిందితులు ఉల్లంఘనకు పాల్పడినట్లు నిరూపితమైతే మొత్తానికి మూడు రెట్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

షియోమీతో పాటు జైన్, రావులకు కూడా నోటీసులు పంపినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. అక్రమ చెల్లింపులకు సంబంధించి షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతాలను ఈడీ అటాచ్ చేసింది. ఆ సంస్థకు సంబంధించి రూ.5,551.27 కోట్లను ఫ్రీజ్ చేసింది.
మూడు విదేశీ బ్యాంకులకు కూడా రూ.5,551 కోట్లు చెల్లించాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. షియోమీ ఇండియా 2015 సంవత్సరం నుంచి తన మాతృ సంస్థకు డబ్బు పంపుతోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. Xiaomi ఇండియా భారతదేశంలో పని చేయడం ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత మాత్రమే ఈ డబ్బును పంపడం ప్రారంభించిందని విచారణలో తేలినట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications