ఇదిగో... భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో లేదు: నిర్మలా సీతారామన్
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కనిపిస్తోంది. ఇది మందగమనం కాదని, ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందని పలువురు ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మందగమన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఎకానమీ ఎలాంటి ఇబ్బందుల్లో లేదని స్పష్టం చేశారు.

ఇదిగో... ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో లేదు
భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో లేదని, 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశలా ముందుకు సాగుతోందని నిర్మల అన్నారు. గత మూడు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని, ఫ్యాక్టరీ ఉత్పత్తులు పెరిగాయని, రూ.1 లక్ష కోట్లకు పైగా రెవెన్యూ వసూళ్లు కనిపించాయని చెప్పారు. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో లేదనేందుకు నిదర్శనం అని అభిప్రాయపడ్డారు.

ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు ఏడు సూచీలు
మన ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు ఏడు ముఖ్యమైన సూచీకలు ఉన్నాయని నిర్మల చెప్పారు. ఎనకామీ ట్రబుల్‌లో లేదని వీటి ద్వారా అర్థమవుతోందని చెప్పారు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన చర్చ సందర్భంగా లోకసభలో ఆమె పైవిధంగా స్పందించారు.

స్టాక్ మార్కెట్లు అప్
FDIలు పెరగడం, ఉత్పత్తులు పెరగడం, జీఎస్టీ రెవెన్యూ రూ.1 లక్ష కోట్లు దాటడంతో పాటు ఫారెక్స్ రిజర్వ్‌లు భారీగా పెరిగాయని నిర్మల గుర్తు చేశారు. స్టాక్ మార్కెట్ రోజు రోజుకు లాభాల్లో ట్రేడ్ అవుతోందన్నారు.

నాలుగు అంశాలపై దృష్టి
ప్రభుత్వం ముఖ్యంగా నాలుగు అంశాలపై దృష్టి సారించిందని నిర్మల చెప్పారు. ప్రయివేటు పెట్టుబడులు, ఎగుమతులు, ప్రయివేటు, పబ్లిక్ కన్సంప్షన్ వంటి వాటిపై దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడులకు సంబంధించి డిసెంబర్ నెలలో జాతీయ మౌలిక సదుపాయాల వివరాలను ప్రకటించినట్లు చెప్పారు. రానున్న అయిదేళ్లలో ఇన్ఫ్రా పైన రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించామన్నారు.


Click it and Unblock the Notifications